Mahesh Babu: మహేశ్ బాబుపై గతంలో గుణశేఖర్ కామెంట్స్.. మళ్లీ వైరల్

Guna Sekhars past comments on Mahesh Babu go viral again
  • మహేశ్ తో మూడు సినిమాలు చేసిన గుణశేఖర్
  • మహేశ్ మత్తులాంటి వ్యక్తి అని వ్యాఖ్య
  • ఆయనతో తాను వరుసగా సినిమాలు చేయడం తన తప్పు అని వ్యాఖ్య
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘వారణాసి’తో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే మహేశ్ గురించి గతంలో స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. “మహేశ్ బాబు చాలా ప్రమాదకరమైన వ్యక్తి, ఒక్కసారి ఆయనతో సినిమా చేస్తే చాలు... ఆయన నటనకు, వ్యక్తిత్వానికి అడిక్ట్ అయిపోతాం” అంటూ గుణశేఖర్ సంచలన కామెంట్స్ చేశారు. మహేశ్ బాబు ఒక మత్తు లాంటి వ్యక్తి అని, అందుకే తాను వరుసగా ‘ఒక్కడు’, ‘అర్జున్’, ‘సైనికుడు’ వంటి మూడు సినిమాలు ఆయనతోనే చేశానని, అది ఒక రకంగా తాను చేసిన తప్పేనని ఆయన అభిప్రాయపడ్డారు.

గుణశేఖర్ మాటల్లో చెప్పాలంటే.. మహేశ్ బాబు దర్శకులను తన నటనతో ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంటారట. డైరెక్టర్ 100 శాతం అడిగితే, మహేశ్ 200 శాతం అవుట్‌పుట్ ఇచ్చే ‘మాయగాడు’ అని ఆయన ప్రశంసించారు. వరుసగా ఒకే హీరోతో మూడు సినిమాలు చేయడం వల్ల తన కెరీర్‌లో కొంత గ్యాప్ వచ్చిందని... ఆ మాయలో పడకుండా వేరే హీరోలతో కూడా సినిమాలు చేయాల్సింది అని గుణశేఖర్ పేర్కొన్నారు.
Mahesh Babu
Guna Sekhar
Rajamouli
Varanasi Movie
Telugu Cinema
Tollywood
Okkadu Movie
Arjun Movie
Sainikudu Movie
Telugu Movies

More Telugu News