Mohammed Siraj: టీ20 ప్రపంచ కప్‌కు సిరాజ్ ఎంపిక కాకపోవడంపై స్పందించిన ఏబీ డివిల్లియర్స్

AB de Villiers Reacts to Mohammed Siraj T20 World Cup Snub
  • సిరాజ్‌కు జట్టులో చోటు దక్కకపోవడం దురదృష్టకరమన్న డివిల్లియర్స్
  • సెలక్టర్లు ఫామ్ కంటే కూర్పుకు ప్రాధాన్యత ఇచ్చారన్న డివిల్లియర్స్
  • హర్షిత్ రాణా బ్యాటింగ్ కూడా చేయగలడని అందుకే జట్టులోకి తీసుకుని ఉంటారని వెల్లడి
టీ20 ప్రపంచకప్-2026లో పేసర్ మహమ్మద్ సిరాజ్‌కు చోటు దక్కని విషయం తెలిసిందే. ఈ అంశంపై దక్షిణాఫ్రికా మాజీ సారథి ఏబీ డివిల్లియర్స్ స్పందించాడు. సిరాజ్‌కు ప్రపంచ కప్ జట్టులో స్థానం లభించకపోవడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డాడు. సెలక్టర్లు ఆటగాళ్ల ఫామ్ కంటే జట్టు కూర్పుపైనే అధికంగా దృష్టి సారించినట్లుగా ఉందని పేర్కొన్నాడు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

సిరాజ్ వన్డే జట్టులో స్థానం సంపాదించుకున్నాడని, కానీ దురదృష్టవశాత్తూ టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక కాలేకపోయాడని అన్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ ఎంపికయ్యారని, హర్షిత్ రాణా బ్యాటింగ్ కూడా చేయగలడని తెలిపాడు. అందుకే సెలక్టర్లు అతడిని జట్టులోకి తీసుకున్నట్టు అర్థమవుతోందని చెప్పాడు. సీమ్ బౌలర్లతో పాటు స్పిన్నర్లపై కూడా సెలక్టర్లు దృష్టి సారించినట్లు చెప్పాడు. ఒకవేళ వారు సీమర్లతో పాటు వికెట్లు సాధిస్తే అది అదనపు ప్రయోజనమని అభిప్రాయపడ్డాడు.

కాగా, సిరాజ్ 2024 జులైలో టీమిండియా తరఫున చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. అయితే, సిరాజ్ జనవరి 11 నుంచి న్యూజిలాండ్ తో జరగనున్న వన్డే సిరీస్‌లో పాల్గొననున్నాడు. 

ఏబీ డివిల్లియర్స్, సిరాజ్ గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఐపీఎల్‌లో ప్రాతినిధ్యం వహించారు.
Mohammed Siraj
T20 World Cup
AB de Villiers
Jasprit Bumrah
Arshdeep Singh
Harshit Rana

More Telugu News