రిపబ్లిక్ డే పరేడ్ కు టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలంటే..!
- బీటింగ్ రిట్రీట్ పాస్ లు కూడా ఆన్‌లైన్ లోనే బుకింగ్
- మొదటి కేటగిరీకి రూ.100, రెండవ కేటగిరీకి రూ.20
- ఒరిజినల్ ఐడీ కార్డు చూపిస్తేనే అనుమతి
దేశ రాజధాని ఢిల్లీలో వైభవోపేతంగా జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి టికెట్ల అమ్మకం ఈ రోజు ఉదయం నుంచే ప్రారంభమైంది. ఆన్ లైన్ లో టికెట్లు కొనుగోలు చేసి, వ్యక్తిగత గుర్తింపు పత్రంతో జనవరి 26న జరిగే వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. త్రివిధ దళాల పరేడ్, సైనిక ఆయుధాల ప్రదర్శనతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన శకటాల ఊరేగింపును చూడొచ్చు. ఇక, జనవరి 28న జరిగే బీటింగ్ రిట్రీట్ పూర్తి డ్రెస్ రిహార్సల్, జనవరి 29న జరిగే బీటింగ్ రిట్రీట్ పరేడ్ లకు కూడా ముందస్తుగా టికెట్ కొనుగోలు చేసి హాజరు కావొచ్చు. టికెట్ తో పాటు ఒరిజినల్ ఐడీ కార్డు చూపిస్తేనే లోపలికి అనుమతి ఉంటుంది. గుర్తింపు కార్డులో పూర్తి చిరునామా లేకపోతే టికెట్ రద్దవుతుంది.
టికెట్ ధర ఎంతంటే..
రిపబ్లిక్ డే పరేడ్ టిక్కెట్లు రెండు కేటగిరీలలో అందుబాటులో ఉన్నాయి. మొదటి కేటగిరీకి రూ.100, రెండవ కేటగిరీకి రూ.20. బీటింగ్ రిట్రీట్ పరేడ్ టిక్కెట్ల ధర రూ.100, బీటింగ్ రిట్రీట్ పూర్తి డ్రెస్ రిహార్సల్ టిక్కెట్ల ధర రూ.20.
ఆన్‌లైన్ లో బుకింగ్ కోసం..
రక్షణ మంత్రిత్వ శాఖ ఆహ్వాన వెబ్‌సైట్ (aamantran.mod.gov.in) లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ కావాలి. పేరు, పుట్టిన తేదీ, గుర్తింపు కార్డు, చిరునామా, మొబైల్ నెంబర్ వివరాలను నమోదు చేయడంతో పాటు గుర్తింపు కార్డు ఫొటోను అప్ లోడ్ చేయాలి. ఆపై రిపబ్లిక్ డే పరేడ్, బీటింగ్ రిట్రీట్ కోసం టిక్కెట్లను బుక్ చేసుకుని పేమెంట్ చేయాలి.