దక్షిణ కొరియా ప్రియుడిని కత్తితో పొడిచి చంపిన మణిపూర్ యువతి
- మద్యం మత్తులో ఇరువురి మధ్య గొడవ
- దాడి అనంతరం బాధితుడిని స్వయంగా ఆసుపత్రికి తరలించిన యువతి
- వేధింపులు భరించలేకే దాడి చేశానన్న నిందితురాలు
దక్షిణ కొరియాకు చెందిన ఒక వ్యక్తిని.. అతడితో సహజీవనం చేస్తున్న మణిపూర్ యువతి కత్తితో పొడిచి చంపింది. గ్రేటర్ నోయిడాలోని ఒక హైరైజ్ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని ఒక మొబైల్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న డక్ హీ యుహ్‌గా గుర్తించారు.
పోలీసుల కథనం ప్రకారం.. డక్ హీ యుహ్, లుంజీనా పామై అనే యువతి కలిసి నివసిస్తున్నారు. ఘటన జరిగిన రోజు ఇద్దరూ కలిసి మద్యం తాగారు. ఆ సమయంలో వారి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆగ్రహానికి లోనైన పామై.. కత్తితో డక్ హీ ఛాతీపై బలంగా పొడిచింది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె స్వయంగా అతడిని జిమ్స్ ఆసుపత్రికి తరలించింది. అయితే, అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసు కస్టడీలో ఉన్న పామై విచారణలో కీలక విషయాలు వెల్లడించింది. డక్ హీ తరచూ మద్యం తాగి తనపై భౌతిక దాడికి పాల్పడేవాడని, ఆ వేధింపులు భరించలేకనే ఆవేశంలో దాడి చేశానని తెలిపింది. అతడిని చంపాలనే ఉద్దేశం తనకు లేదని పోలీసులకు వివరించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.