Hyderabad Traffic Police: ఆటో ఇవ్వకుంటే పామును వదులుతా.. ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించిన ఆటో డ్రైవర్

Hyderabad Auto Driver Threatens Police With Snake
  • ఆటో వదిలేయకుంటే పామును వదులుతానని ట్రాఫిక్ సిబ్బందికి బెదిరింపులు
  • హైదరాబాద్ లోని పాతబస్తీలో ఘటన
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
మద్యం మత్తులో ఆటో నడుపుతూ పట్టుబడిన ఓ యువకుడు ట్రాఫిక్ పోలీసులను పాముతో బెదిరించాడు. తన ఆటోను ఇవ్వకుంటే పామును వదులుతానని హల్ చల్ చేశాడు. హైదరాబాద్ లోని పాతబస్తీలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే..

చాంద్రాయణ గుట్ట చౌరస్తాలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టిన ట్రాఫిక్ సిబ్బంది అటుగా వచ్చిన ఓ ఆటోను ఆపారు. ఆటో డ్రైవర్ ను పరీక్షించగా మద్యం మత్తులో ఉన్నట్లు తేలింది. దీంతో అతడిపై కేసు నమోదు చేసి ఆటోను సీజ్ చేశారు.

ఆటోలో ఉన్న తన సామగ్రి తీసుకుంటానని వెళ్లిన డ్రైవర్... ఆటోలో నుంచి ఓ పామును తీసుకువచ్చి పోలీసులను బెదిరించాడు. ఆపై ఆటోను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ఆటో డ్రైవర్ ను పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Hyderabad Traffic Police
Hyderabad
Traffic Police
Drunk and Drive
Snake
অটো ড্রাইভার
Chandrayangutta
Old City Hyderabad
Crime News

More Telugu News