Congress Party: ఆంధ్రప్రదేశ్‌లో డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్

Congress Party Announces DCC Presidents for Andhra Pradesh
  • అధ్యక్షుల జాబితా విడుదల చేసిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్
  • జిల్లాలు, పట్టణాలకు కలిపి 41 మంది అధ్యక్షుల పేర్లు ప్రకటన 
  • కార్యకర్తలు, ముఖ్య నేతల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని నియామకాలు చేసినట్లు వెల్లడి
ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా కాంగ్రెస్ కమిటీల (డీసీసీ) అధ్యక్షులను పార్టీ అధిష్టానం నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నిన్న అధికారికంగా జాబితాను విడుదల చేశారు. జిల్లాలు, ముఖ్య పట్టణాలకు కలిపి మొత్తం 41 మంది అధ్యక్షుల పేర్లను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో నియమించినట్లు వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు.
 
ప్రతి జిల్లాకు నియమించిన ఏఐసీసీ పర్యవేక్షకులు విస్తృత స్థాయిలో సమీక్షలు నిర్వహించి, పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు, స్థానిక నేతలు, ముఖ్య వ్యక్తులతో చర్చలు జరిపిన అనంతరం సమగ్ర నివేదికలు సమర్పించారని వెల్లడించారు. ఆ నివేదికల ఆధారంగానే కొత్త అధ్యక్షుల ఎంపిక జరిగిందని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.
 
కొత్తగా నియమితులైన డీసీసీ అధ్యక్షులు వీరే:
 
1. అల్లూరి సీతారామరాజు జిల్లా - సతక బుల్లిబాబు
2. అనకాపల్లి - బొడ్డు శ్రీనివాస్
3. అనంతపురం - వై. మాధుసూధన్ రెడ్డి
4. అనంతపురం సిటీ - షేక్ ఇమామ్ వలి
5. అన్నమయ్య (రాజంపేట్) - గాజుల భాస్కర్
6. బాపట్ల - ఆమంచి కృష్ణ మోహన్
7. చిత్తూరు - దెయ్యాల రమేష్ బాబు
8. చిత్తూరు సిటీ - జి. టికరామ్
9. డా. అంబేద్కర్ కొనసీమ - కోతూరి శ్రీనివాస్
10. తూర్పు గోదావరి (రాజమహేంద్రవరం) - బోడ లక్ష్మీ వెంకట ప్రసన్న
11. ఏలూరు - రాజనాల రామ్మోహన్ రావు
12. ఏలూరు సిటీ -  పి. బాల వెంకట సుబ్రహ్మణ్యం
13. గుంటూరు - సుధీర్ బాబు యెన్నం
14. గుంటూరు సిటీ -  షేక్ మహమ్మద్ ఇఫ్తికార్ అహ్మద్ (ఖలీల్)
15. కడప సిటీ - సయ్యద్ గౌస్ పీర్
16. కాకినాడ - మడేపల్లి సత్యానందరావు
17. కాకినాడ సిటీ - చెక్కా నూకరాజు
18. కృష్ణ (మచిలీపట్నం) - అందె శ్రీరామ్ మూర్తి
19. కర్నూల్ - క్రాంతి నాయుడు
20. కర్నూల్ సిటీ - ఎస్. జిలాని
21. మచిలీపట్నం - అబ్దుల్ మతీన్
22. మన్యం - వంగల దాలి నాయుడు
23. నంద్యాల - డా. గార్లపాటి మద్దిలేటి స్వామి
24. నెల్లూరు సిటీ -  షేక్ అల్లాభక్ష్
25. ఎన్టీఆర్ (విజయవాడ) -  బొర్రా కిరణ్
26. ఒంగోలు సిటీ - దేవిరెడ్డి ఆదినారాయణ
27. పల్నాడు (నరసరావుపేట) - అలెగ్జాండర్ సుధాకర్
28. ప్రకాశం (ఒంగోలు) - షేక్ సైదా
29. రాజమండ్రి సిటీ - బి. మురళీధర్
30. పొట్టిశ్రీరాములు నెల్లూరు - నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి
31. శ్రీ సత్యసాయి (హిందూపూర్) -  కేఎస్. షన్వాజ్
32. శ్రీకాకుళం - సనపాల అన్నాజీ రావు
33. శ్రీకాకుళం సిటీ - రెళ్ల సురేశ్
34. తిరుపతి - బాలగురువం బాబు
35. తిరుపతి సిటీ - గౌడపేరు చిట్టిబాబు
36. విజయవాడ సిటీ - నరహరి శెట్టి నరసింహారావు
37. విశాఖపట్నం - అడ్డాల వెంకట వర్మ రాజు
38. విజయనగరం - మరిపి విద్యాసాగర్
39. విజయనగరం సిటీ - శ్రీనివాసరావు
40. పశ్చిమ గోదావరి (నరసాపురం) - అంకెం సీతారాం
41. వైఎస్ఆర్ కడప - విజయ జ్యోతి
Congress Party
Andhra Pradesh
DCC Presidents
Mallikarjun Kharge
AP Congress
AICC
K C Venugopal
District Congress Committee
Indian National Congress
Political Appointments

More Telugu News