Hubballi gangrape: కర్ణాటకలో దారుణం: 13 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్ల సామూహిక అత్యాచారం!

Hubballi Gangrape 13 Year Old Girl Assaulted by Three Minors
  • ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యం.
  • పోలీసుల అదుపులోకి ముగ్గురు బాలురు
  • వారిలో ఇద్దరు హైస్కూల్ విద్యార్థులు
  • అఘాయిత్యాన్ని వీడియో తీశామంటూ బాధితురాలిని భయపెట్టిన నిందితులు
కర్ణాటకలోని హుబ్బళ్లిలో దారుణమైన ఘటన వెలుగుచూసింది. 13 ఏళ్ల బాలికపై ముగ్గురు బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. నిందితుల వయసు 14 నుంచి 15 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలి తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో అదే ప్రాంతానికి చెందిన ముగ్గురు బాలురు ఆమెను బలవంతంగా ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై వరుసగా అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తాము తీసిన వీడియోను సోషల్ మీడియాలో పెడతామంటూ బాధితురాలిని భయపెట్టారు.

బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. "నిందితుల్లో ఇద్దరు హైస్కూల్ విద్యార్థులు కాగా, మరొకరు చదువు మధ్యలో ఆపేసిన బాలుడు. ప్రస్తుతం బాలికకు రక్షణ కల్పించాం" అని హుబ్బళ్లి-ధార్వాడ్ పోలీస్ కమిషనర్ ఎన్. శశికుమార్ తెలిపారు. నిందితుల వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, వీడియోల వ్యవహారంపై లోతైన దర్యాప్తు చేస్తున్నామని ఆయన వివరించారు.
Hubballi gangrape
Karnataka crime
Minor rape case
Hubballi news
POCSO Act
Sexual assault
Crime news India
Teenage crime
Police investigation

More Telugu News