Amrapali Kata: లంబసింగిలో సందడి చేసిన ఆమ్రపాలి

Amrapali Kata Visits Lambasingi Explores Tourism Potential
  • కుటుంబ సభ్యులతో కలిసి లంబసింగిలో పర్యటించిన ఏపీటీడీసీ వైస్ చైర్మన్, ఎండీ ఆమ్రపాలి
  • లంబసింగిని ఏడాది పొడవునా పర్యాటకులు సందర్శించేలా ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేస్తున్నామన్న ఆమ్రపాలి
  • హరిత రిసార్ట్స్‌లో త్వరలోనే అదనపు గదుల నిర్మాణం చేపడతామని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆమ్రపాలి కటా ఆంధ్రాకశ్మీర్‌గా పేరొందిన లంబసింగిలో పర్యటించారు. ఆమె కుటుంబ సభ్యులతో కలిసి లంబసింగి హరిత రిసార్ట్స్‌లో బస చేశారు. నిన్న చెరువులవేనం వ్యూపాయింట్, తాజంగి జలాశయం, లంబసింగి స్ట్రాబెర్రీ తోటలను సందర్శించి అక్కడి పర్యాటక అవకాశాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా హరిత రిసార్ట్స్‌లో ఏపీటీడీసీ సిబ్బందితో ఆమె మాట్లాడారు. లంబసింగిని ఏడాది పొడవునా పర్యాటకులు సందర్శించేలా పర్యాటక శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుందని తెలిపారు. పర్యాటకులను మరింతగా ఆకర్షించేందుకు అదనపు సదుపాయాలు కల్పించడంతో పాటు హరిత రిసార్ట్స్‌లో త్వరలోనే అదనపు గదుల నిర్మాణం చేపడతామని వెల్లడించారు.

లంబసింగి ప్రకృతి అందాలు అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్న ఆమె, ప్రతి ఒక్కరూ తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రాంతమని అన్నారు. ఈ పర్యటనలో ఏపీటీడీసీ పర్యాటక శాఖ స్థానిక మేనేజర్ సూరెడ్డి అప్పలనాయుడు పాల్గొన్నారు. 
Amrapali Kata
Lambasingi
Andhra Kashmir
AP Tourism
APTDC
Tourism Andhra Pradesh
Strawberry Farms
Tajangi Reservoir
Cheruvala Venam Viewpoint
Haritha Resorts

More Telugu News