BCCI: బంగ్లాదేశ్ పర్యటనపై బీసీసీఐ కీలక నిర్ణయం!

BCCI Key Decision on Bangladesh Tour Amid Tensions
  • భారత్‌ జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20లు సెప్టెంబర్‌లో ఆడనున్నట్లు ప్రకటించిన బీసీబీ
  • బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు, రాజకీయ అస్థిరత నేపథ్యంలో టీమ్ఇండియా పర్యటనపై అనిశ్చితి 
  • బంగ్లాదేశ్ పర్యటన ఇంకా ఖరారు చేయలేదన్న బీసీసీఐ సీనియర్ అధికారి
భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టీమ్ఇండియా బంగ్లాదేశ్ పర్యటనను ఈ ఏడాదికి తాత్కాలికంగా నిలిపివేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఇటీవల విడుదల చేసిన షెడ్యూల్‌లో భారత్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ను సెప్టెంబర్‌లో నిర్వహిస్తామని పేర్కొంది. అయితే బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు, రాజకీయ అస్థిరత కారణంగా టీమ్ఇండియా పర్యటనను రద్దు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

భారత క్రికెట్ జట్టు విదేశీ పర్యటనలకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి కావడంతో ఈ సిరీస్‌పై సందేహాలు నెలకొన్నాయి. ఈ విషయంపై బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ బంగ్లాదేశ్ పర్యటనపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. గత ఏడాది కూడా టీమ్ఇండియా బంగ్లాదేశ్‌లో పర్యటించలేదని ఆయన గుర్తు చేశారు. అయితే టీ20 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లు మాత్రం షెడ్యూల్ ప్రకారమే భారత్‌లో జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. 
BCCI
Bangladesh tour
Team India
Bangladesh Cricket Board
BCB
India Bangladesh relations
Political tensions
Cricket series
T20 World Cup
Sports

More Telugu News