Dharam Veer Sharma: కుతుబ్ 'మినార్' కాదు, అదొక వేదశాల: భారత పురావస్తు సర్వే మాజీ శాస్త్రవేత్త

Dharam Veer Sharma Qutub Minar was actually a Vedic Observatory
  • ఢిల్లీలో జరుగుతున్న శబ్దోత్సవ్-2026లో పాల్గొన్న ధరమ్ వీర్ శర్మ
  • కుతుబ్ మినార్ పునాది దీర్ఘచతురస్త్రాకారంలో ఉందని వెల్లడి
  • రెండేళ్లు ఈ నిర్మాణంపై పరిశోధనలు జరిపి కొత్త విషయాలు గుర్తించినట్లు వెల్లడి
దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక కట్టడం కుతుబ్ మినార్ వాస్తవానికి వేదశాల అని భారత పురావస్తు సర్వే మాజీ ప్రాంతీయ డైరెక్టర్ ధరమ్ వీర్ శర్మ్ అన్నారు. ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేయడం కోసం నిర్మించిన ఒక అబ్జర్వేటరీ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో జరుగుతున్న శబ్దోత్సవ్-2026 కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కుతుబ్ మినార్‌ను వేదశాల అనడానికి ఆధారాలు, కారణాలు ఉన్నాయని అన్నారు.

ఒక స్మారక చిహ్నం, ఆలయం లేదా భవనం నిర్మించినప్పుడు ఒక ప్రణాళిక, ఉద్దేశం ఉంటుందని ఆయన అన్నారు. ఇది వృత్తాకార నిర్మాణం కాబట్టి సహజంగా పునాది కూడా వృత్తాకారంగానే ఉండాలని అన్నారు. కానీ కుతుబ్ మినార్ పునాది దీర్ఘచతురస్త్రాకారంగా ఉంటుందని తెలిపారు. ఈ చారిత్రక కట్టడంపై రెండేళ్లు పరిశోధనలు చేశామని, నిర్మాణానికి సంబంధించిన అనేక కొత్త విషయాలను గుర్తించామని అన్నారు. అవి డాక్యుమెంట్ రూపంలో లేవని చెప్పారు.

భవనం నిర్మాణం వెనుక కూడా శాస్త్రీయత దాగి ఉందని అన్నారు. సంవత్సరంలో లాంగెస్ట్ డే జూన్ 21న సూర్యుడు దక్షిణాయనంలోకి వచ్చాడని, కుతుబ్ మినార్ నీడ అరగంట పాటు నేలపై పడలేదని ఆయన అన్నారు. ఇవన్నీ ఈ కుతుబ్ మినార్ ఒక వేదశాల అని చెప్పడానికి రుజువులని పేర్కొన్నారు. భారత్‌పై దాడులకు పాల్పడిన విదేశీ పాలకులు దీనిని నాశనం చేశారని పేర్కొన్నారు. ఆ తర్వాత దీనిని తమకు అనుగుణంగా కుతుబ్ మినార్‌గా మార్చుకున్నారని తెలిపారు.
Dharam Veer Sharma
Qutub Minar
Delhi
Archaeological Survey of India
Vedic Observatory
Indian History

More Telugu News