Nagarjuna: బిగ్ బాస్ సీజన్-9కి అదిరిపోయే రేటింగ్స్... నాగార్జున స్పందన

Nagarjuna Reacts to Bigg Boss 9 Grand Finale Ratings
  • స్టార్ మా ఛానల్‌లో 19.6 టీవీఆర్, జియోస్టార్‌లో 285 మిలియన్ మినిట్స్ వ్యూవింగ్ నమోదుకావడం విశేషమన్న నాగార్జున
  • గత ఐదేళ్లలో బిగ్‌బాస్ తెలుగు సీజన్–9 గ్రాండ్ ఫినాలే అతిపెద్ద హిట్‌గా నిలిచిందని వ్యాఖ్య
బిగ్ బాస్ సీజన్ - 9కు అద్భుతమైన రేటింగ్స్ వచ్చినందుకు హోస్ట్ అక్కినేని నాగార్జున 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. గ్రాండ్ ఫినాలే సాధించిన రేటింగ్స్ చూసి ట్రేడ్ వర్గాలతో పాటు హోస్ట్ నాగార్జున కూడా ఆశ్చర్యానికి గురయ్యారు.

స్టార్ మా ఛానల్‌లో 19.6 టీవీఆర్, జియోసినిమాలో 285 మిలియన్ మినిట్స్ వ్యూవింగ్ నమోదుకావడం విశేషమని నాగార్జున పేర్కొన్నారు. ‘UNBEATABLE!! UNREACHABLE!! స్టార్ మాలో 19.6 టీవీఆర్, జియోస్టార్‌లో 285 మిలియన్ నిమిషాల వ్యూయింగ్. గత ఐదేళ్లలో బిగ్‌బాస్ తెలుగు సీజన్ - 9 గ్రాండ్ ఫినాలే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. ఎమోషన్స్, ప్యాషన్, గొడవలు, మరచిపోలేని జ్ఞాపకాలతో నిండిన సీజన్ ఇది. కంటెస్టెంట్లకు, స్టార్ మా, ఎండెమోల్ షైన్ టీమ్‌కు, ముఖ్యంగా లక్షలాది మంది ప్రేక్షకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు’ అంటూ నాగార్జున భావోద్వేగంతో కూడిన పోస్ట్ చేశారు. 
Nagarjuna
Bigg Boss Telugu Season 9
Star Maa
Grand Finale Ratings
JioStar
Telugu Reality Show
Endemol Shine
TVR
Bigg Boss Telugu
Telugu Television

More Telugu News