Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సెకండ్ ఇన్నింగ్స్: 2025లో సాధించిన 20 అద్భుత విజయాలపై వాషింగ్టన్ పోస్ట్ కథనం

Donald Trump Second Innings Washington Post on 20 Achievements in 2025
  • ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని ప్రశంస
  • భారత్-పాకిస్థాన్ సహా పలు దేశాల మధ్య శాంతి చర్చల్లో కీలక పాత్ర పోషించారని కితాబు
  • అక్రమ వలసలకు చెక్ పెట్టారన్న పత్రిక
  • నాటో  దేశాల రక్షణ బడ్జెట్ పెంచారన్న ‘వాషింగ్టన్ పోస్ట్’
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తన రెండో విడత పాలనలో అసాధారణ విజయాలు సాధించారని ప్రముఖ పత్రిక 'వాషింగ్టన్ పోస్ట్' ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. మార్క్ ఎ. థిస్సెన్ రాసిన ఈ కాలమ్‌లో, గత ఏడాదిలో ట్రంప్ తీసుకున్న 20 అత్యుత్తమ నిర్ణయాలను విశ్లేషించారు. సాధారణంగా ఇచ్చే 10 పాయింట్ల జాబితా ఈసారి ట్రంప్ సాధించిన విజయాలకు సరిపోవడం లేదని రచయిత పేర్కొనడం గమనార్హం.

ఈ జాబితాలో అన్నిటికంటే ముఖ్యమైనదిగా ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడాన్ని పేర్కొన్నారు. 'ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్' ద్వారా ట్రంప్ అత్యంత సాహసోపేతమైన విదేశీ విధాన నిర్ణయం తీసుకున్నారని పత్రిక ప్రశంసించింది. అలాగే, అంతర్జాతీయంగా శాంతి స్థాపనలో ట్రంప్ కొత్త రికార్డు సృష్టించారని, ముఖ్యంగా భారత్-పాకిస్థాన్, ఇజ్రాయెల్-ఇరాన్, ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడం, ఇతర దేశాల మధ్య సరిహద్దు వివాదాలను పరిష్కరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని వివరించింది.

అమెరికా అంతర్గత భద్రత, ఆర్థికాంశాల్లోనూ ట్రంప్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. అక్రమ వలసలను దాదాపు పూర్తిస్థాయిలో అరికట్టడంతో పాటు, అమెరికన్ చిన్నారుల భవిష్యత్తు కోసం 'ట్రంప్ అకౌంట్స్' పేరుతో ఒక్కొక్కరికి 1,000 డాలర్ల ట్రస్ట్ ఫండ్‌ను ప్రారంభించారు. నాటో కూటమిలోని సభ్య దేశాలు తమ రక్షణ వ్యయాన్ని జీడీపీలో 5 శాతానికి పెంచేలా ఒప్పించడంలో ఆయన విజయం సాధించారు. విదేశీ సహాయ సంస్థ (యూఎస్ ఎయిడ్)ను మూసివేయడం, రక్షణ బడ్జెట్‌ను 156 బిలియన్ డాలర్లకు పెంచడం, టారిఫ్ హెచ్చరికల ద్వారా ఐరోపా, ఆసియా దేశాలతో కొత్త వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటివి ఈ జాబితాలో ప్రధానంగా నిలిచాయి.
Donald Trump
Trump 2025
Washington Post
Iran nuclear program
Operation Midnight Hammer
India Pakistan
Israel Iran
US foreign policy
US economy
NATO

More Telugu News