Bandi Sanjay: ప్రధాని మోదీకి సీపీఐ ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాల్సిందే: బండి సంజయ్

Bandi Sanjay Demands CPI MLA Apology to PM Modi
  • ప్రధానిపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్న బండి
  • కమ్యూనిస్టు భావజాలం ప్రజాదరణ కోల్పోవడానికి బాధ్యతలేని, అసభ్యకరమైన భాషే కారణమని వ్యాఖ్య
  • అసెంబ్లీలో అటువంటి వ్యాఖ్యలను స్పీకర్ అనుమతించడం బాధాకరమని వెల్లడి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు క్షమాపణ చెప్పాల్సిందేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ప్రధాని మోదీపై కూనంనేని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

అసెంబ్లీ వేదికపై ఇలాంటి వ్యాఖ్యలకు ఏమాత్రం స్థానం లేదని అన్నారు. దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు భావజాలం ప్రజాదరణ కోల్పోవడానికి ఇలాంటి బాధ్యతలేని, అసభ్యకరమైన భాషే కారణమని విమర్శించారు.

తెలంగాణ అసెంబ్లీలో అటువంటి వ్యాఖ్యలను స్పీకర్ అనుమతించడం బాధాకరమని బండి సంజయ్ అన్నారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాల్సిన బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని, మిత్రపక్షాన్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ వ్యవహారం చోటుచేసుకుందని ఆరోపించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని పేర్కొన్నారు.

కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు మాత్రం రాజకీయ దూషణలకే పరిమితమై ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కూనంనేని తన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకుని, దేశ ప్రజలకు అలాగే ప్రధాని నరేంద్ర మోదీకి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 
Bandi Sanjay
Narendra Modi
Kunamneni Sambasiva Rao
CPI
Telangana Assembly
BJP
Apology
Political Criticism
India Progress

More Telugu News