Yogesh: ఇంటిని ఖాళీ చేయమని కోరిన తండ్రి.. సుపారీ ఇచ్చి చంపించిన కొడుకులు

Ex IAF Officer Yogesh Killed by Sons in Ghaziabad
  • ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఘటన
  • హత్య పథకంలో పాలుపంచుకున్న పోలీస్ కానిస్టేబుల్
  • ఒకరి అరెస్ట్.. పరారీలో ఉన్న కుమారులు, కానిస్టేబుల్ కోసం గాలింపు
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ కు చెందిన రిటైర్డ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) మాజీ అధికారి యోగేష్ (58) హత్య కేసులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. ఈ హత్యను ఆయన సొంత కుమారులే సుపారీ కిల్లర్లతో చేయించినట్లు నిర్ధారించారు. డిసెంబర్ 26న లోనీ ప్రాంతంలోని అశోక్ విహార్ కాలనీలో యోగేష్ తన ఇంటికి తిరిగి వస్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆయనను కాల్చి చంపారు.

పోలీసుల కథనం ప్రకారం.. యోగేష్ తన ఇంట్లో ఉంటున్న కుమారులను ఆ ఇల్లు ఖాళీ చేయాలని కొంతకాలంగా ఒత్తిడి తెస్తున్నారు. ఆస్తిపై ఆశతో పాటు, ఇల్లు ఖాళీ చేయడం ఇష్టం లేని కుమారులు తండ్రిని వదిలించుకోవాలని పథకం వేశారు. ఇందుకోసం తమ పొరుగున ఉండే అరవింద్ (32) అనే వ్యక్తికి సుపారీ ఇచ్చారు. అరవింద్ తన బావమరిది, కౌశాంబి జిల్లాలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నవీన్‌తో కలిసి ఈ కాల్పులకు పాల్పడ్డాడు.

బుధవారం సాయంత్రం నిందితుడు అరవింద్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడి నుంచి పిస్టల్, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో యోగేష్‌పై తానే కాల్పులు జరిపినట్లు అరవింద్ అంగీకరించాడు. ఘజియాబాద్ కోర్టు అతడికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. యోగేష్ ఇద్దరు కుమారులు, కానిస్టేబుల్ నవీన్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 
Yogesh
Indian Air Force
IAF
Murder
Property Dispute
Supari Killers
Ghaziabad
Loni
Ashok Vihar Colony
Crime

More Telugu News