ప్రభాస్ ఫ్యాన్స్‌కు ‘ది రాజా సాబ్’ న్యూ ఇయర్ స్పెషల్ గిఫ్ట్

  • ‘ది రాజా సాబ్’ నుంచి ‘రాజే యువరాజే’ అంటూ సాగే ఫుల్ సాంగ్ విడుదల
  • జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా మూవీ గ్రాండ్ రిలీజ్
  • డార్లింగ్‌ కెరీర్‌లోనే తొలి హారర్ ఫాంటసీ చిత్రం
రెబ‌ల్‌ స్టార్ ప్రభాస్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ది రాజా సాబ్’. సంక్రాంతి కానుకగా ఈ నెల‌ 9న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. విడుదలకు మరో ఎనిమిది రోజుల సమయం మాత్రమే ఉండటంతో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా నూతన సంవత్సరం సందర్భంగా ప్రభాస్ అభిమానులకు చిత్ర యూనిట్ ఓ మ్యూజికల్ సర్ ప్రైజ్ ఇచ్చింది.

క్రిస్మస్ సందర్భంగా ప్రోమోతో ఆకట్టుకున్న ‘రాజే యువరాజే’ పాట ఫుల్ లిరికల్ వీడియోను న్యూ ఇయర్ గిఫ్ట్‌గా మేకర్స్ తాజాగా విడుదల చేశారు. "రాజే యువరాజే.. కొలిచేటి తొలి ప్రేమికుడే.. నడిపించేది అతడే" అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ విన‌సొంపుగా ఉంది. తమన్ స్వరపరిచిన ఈ ట్యూన్ చాలా ఫ్రెష్‌గా ఉందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇండియాలోనే బిగ్గెస్ట్ హారర్ ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన్నట్లు మేకర్స్ ఇప్ప‌టికే ప్రకటించారు. ఇది డార్లింగ్‌ కెరీర్‌లోనే ఇది తొలి హారర్ జోనర్ చిత్రం కావడం విశేషం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన‌ ఈ చిత్రంలో సంజయ్ దత్, బ్రహ్మానందం, సముద్రఖని వంటి భారీ తారాగణం నటించింది. ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారని, సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయమని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.



More Telugu News