Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జపాన్‌లో భూకంపం... కొత్త సంవత్సరాది వేళ కలవరం

Japan Earthquake Strikes on New Years Day
Advertisement
  • నోడా ప్రాంతంలో భూకంపం
  • రిక్టర్ స్కేలుపై 6 తీవ్రతతో భూకంపం
  • నోడాకు 91 కిలోమీటర్ల దూరంలో, 19.3 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం
Advertisement
నూతన సంవత్సరం వేళ జపాన్‌లో భూకంపం సంభవించింది. తూర్పు నోడా నగరంలో రిక్టర్ స్కేలుపై 6 తీవ్రతతో భూమి కంపించింది. నోడాకు తూర్పున 91 కిలోమీటర్ల దూరంలో, 19.3 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అమెరికా జియాలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం కారణంగా జరిగిన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం గురించిన వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ నెల 8వ తేదీన జపాన్ తూర్పు తీరంలో 7.5 తీవ్రతతో భూకంపం వచ్చిన విషయం విదితమే. ఆ సమయంలో పలు ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం డిసెంబర్ 12న 6.7 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది.

Advertisement
Advertisement
Japan Earthquake
Japan
Earthquake
Noda
Tibet
Tsunami Warning
US Geological Survey

More Telugu News