Young India Skills University: స్కిల్స్ యూనివర్సిటీలో వెయ్యి మందికి చేరిన శిక్షణ పొందిన విద్యార్థులు

Young India Skills University Reaches 1000 Trained Students
  • పీపీపీ విధానంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్వహణ
  • రేవంత్ రెడ్డి ఛాన్స్‌లర్‌గా, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వైస్ ఛాన్స్‌లర్‌గా స్కిల్స్ యూనివర్సిటీ
  • పారిశ్రామికవేత్తలతో కూడిన బోర్డ్‌కు ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా
హైదరాబాద్‌లోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో శిక్షణ పొందిన విద్యార్థుల సంఖ్య వెయ్యికి చేరుకుంది. ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలకు సరిపోయే నైపుణ్యాన్ని అందించే లక్ష్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి గత ఏడాది ఆగస్టు 1న శంకుస్థాపన చేశారు. ఈ యూనివర్సిటీని పీపీపీ విధానంలో నిర్వహిస్తున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఛాన్స్‌లర్‌గా, విశ్రాంత ఐఏఎస్ అధికారి సుబ్బారావు వైస్ ఛాన్స్‌లర్‌గా ఉన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలతో కూడిన బోర్డ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ యూనివర్సిటీని పర్యవేక్షిస్తోంది.

పారిశ్రామికవేత్తలతో కూడిన బోర్డుకు ఆనంద్ మహీంద్రా ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీలో తాత్కాలిక క్యాంపస్ నిర్వహిస్తున్నారు. లాజిస్టిక్స్, హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్, ఫార్మా, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి రంగాల్లో స్వల్పకాలిక, సర్టిఫికేషన్ కోర్సుల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. మైక్రోసాఫ్ట్, రెడ్డీస్ ల్యాబ్స్, ఏఐజీ, అపోలో ఆసుపత్రులు, జీఎంఆర్ కార్గో వంటి సంస్థలు యూనివర్సిటీలో భాగస్వామ్యమయ్యాయి.
Young India Skills University
Hyderabad
Skills University
Revanth Reddy
Subbarao
Anand Mahindra

More Telugu News