Telangana Government: తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త... పెండింగ్ బిల్లులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

Telangana Government Releases Pending Bills for Employees
  • డిసెంబర్ నెలకు సంబంధించి రూ.713 కోట్లను విడుదల చేసిన ప్రభుత్వం
  • పెండింగ్ బిల్లులు రూ.10 వేల కోట్లకు చేరడంతో ఆందోళన చేపట్టిన ఉద్యోగులు
  • ఆగస్టు నుంచి ప్రతి నెల రూ.700 కోట్లు విడుదల చేస్తున్న ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల్లో భాగంగా డిసెంబర్‌ నెలకు సంబంధించిన రూ.713 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఉద్యోగ సంఘాలతో కుదిరిన ఒప్పందం ప్రకారం, ప్రతి నెల రూ.700 కోట్లు విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆర్థిక శాఖాధికారులను ఈ నెల నిధులు విడుదల చేయాలని ఆదేశించారు.

గత కొన్నేళ్లుగా ఉద్యోగుల గ్రాట్యుటీ, జీపీఎఫ్, సరెండర్ లీవులు, అడ్వాన్సులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు పేరుకుపోవడంతో సుమారు రూ.10 వేల కోట్లకు చేరాయి. ఈ సమస్యపై ఉద్యోగ సంఘాలు జూన్ నెలలో ఆందోళన చేపట్టాయి. ప్రతి నెల రూ.700 కోట్లు చెల్లిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మొదటి విడతగా జూన్ నెలాఖరులో రూ.183 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం, ఆగస్టు నుంచి ప్రతి నెల రూ.700 కోట్లు విడుదల చేస్తోంది.
Telangana Government
Telangana employees
Telangana
Government employees pending bills

More Telugu News