Ganta Srinivasa Rao: విశాఖ రుషికొండ భవనాలపై అభిప్రాయ సేకరణ తర్వాతే నిర్ణయం: ఎమ్మెల్యే గంటా
- స్థానిక ప్రజా ప్రతినిధుల అభిప్రాయం తర్వాతనే రుషికొండ భవనాలపై ప్రభుత్వ నిర్ణయం ఉంటుందన్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
- ఈ మేరకు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సూచించారన్న గంటా
- మ్యూజియం, ఆధ్యాత్మిక కేంద్రం, రిసార్ట్స్ తదితర అవసరాలకు వినియోగించాలని పలు సంస్థలు ప్రతిపాదనలు చేశాయన్న గంటా
విశాఖ రుషికొండ భవనాల వినియోగంపై స్థానిక ప్రజా ప్రతినిధుల అభిప్రాయ సేకరణ తర్వాతనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. రుషికొండ భవనాలపై స్థానిక ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సూచించారన్నారు. నిన్న ఆయన విశాఖ ఎంవీపీ కాలనీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ రుషికొండ భవనాల అంశంపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.
రుషికొండలోని భవనాలను మ్యూజియం, ఆధ్యాత్మిక కేంద్రం, రిసార్ట్స్ తదితర అవసరాలకు వినియోగించాలని పలు సంస్థలు ప్రతిపాదనలు చేసినట్లు ఆయన తెలిపారు. అయితే ఏడాదిన్నరగా సరైన నిర్వహణ లేకపోవడంతో భవనాలు క్రమంగా పాడైపోతున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించారని చెప్పారు.