Deepti Sharma: మహిళల టీ20ల్లో వరల్డ్ రికార్డ్.. చరిత్ర సృష్టించిన భారత ఆల్ రౌండర్ దీప్తిశర్మ
- మహిళల టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా దీప్తి శర్మ
- ఆస్ట్రేలియా దిగ్గజం మేగాన్ షుట్ రికార్డును అధిగమించిన భారత స్టార్
- టీ20ల్లో 1000 పరుగులు, 150 వికెట్లు తీసిన ప్రపంచపు తొలి క్రికెటర్‌గా ఘనత
భారత స్టార్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ సరికొత్త చరిత్ర లిఖించింది. శ్రీలంకతో మంగళవారం తిరువనంతపురంలో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో ఆమె తన 152వ వికెట్ తీయడం ద్వారా మహిళల అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా అగ్రస్థానానికి చేరుకుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాకు చెందిన మేగాన్ షుట్ (151 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును దీప్తి తుడిచిపెట్టేసింది. ప్రస్తుతం పాకిస్థాన్‌కు చెందిన నిదా దార్ (144) మూడో స్థానంలో ఉంది.
28 ఏళ్ల దీప్తి శర్మ ఈ వారంలోనే మరో అరుదైన ఘనతను కూడా అందుకుంది. పురుషుల, మహిళల క్రికెట్ చరిత్రలోనే టీ20 ఫార్మాట్‌లో 1000 పరుగులు చేయడంతో పాటు 150 వికెట్లు తీసిన తొలి క్రికెటర్‌గా ఆమె రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఐసీసీ ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలో ఉన్న దీప్తి.. ఇటీవల భారత్ గెలుచుకున్న 2025 ప్రపంచకప్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచిన సంగతి తెలిసిందే.
మైదానంలోనే కాకుండా ఆర్థికంగానూ దీప్తి తన సత్తా చాటుతోంది. ఇటీవల జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలో ఆమెను యూపీ వారియర్స్ జట్టు రూ. 3.2 కోట్లకు తిరిగి దక్కించుకుంది. లీగ్ చరిత్రలోనే ఇది రెండో అత్యధిక ధర కావడం విశేషం.
ఇక, ఐదో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 175 పరుగులు చేయగా, అనంతరం శ్రీలంకను 160 పరుగులకే కట్టడి చేసి 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 5-0తో క్లీన్ స్వీప్ చేసి తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది. భారత బౌలర్లలో రాధా యాదవ్ కూడా 100 వికెట్ల మైలురాయిని దాటి రెండో అత్యుత్తమ భారత బౌలర్‌గా కొనసాగుతోంది.