Ramakrishna: ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికల్లో రామకృష్ణ ప్యానల్‌ ఘన విజయం

Ramakrishna Panel Wins AP Secretariat Employees Union Elections
  • హోరాహోరీగా సాగిన ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలు
  • మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్న రామకృష్ణ ప్యానల్ 
  • ప్రధాన కార్యదర్శి, అదనపు కార్యదర్శి పదవులు దక్కించుకున్న రాకేశ్ ప్యానల్
ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఈ ఎన్నికల్లో రామకృష్ణ ప్యానల్ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. రామకృష్ణ ప్రత్యర్థి కోట్ల రాజేష్ ప్యానల్ నుండి ప్రధాన కార్యదర్శిగా నాపా ప్రసాద్, అదనపు కార్యదర్శిగా బి. లింగారెడ్డి స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఉద్యోగుల సంఘం ఎన్నికలు నిన్న ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగాయి. మొత్తం 1,159 ఓటర్లకు గానూ 1,105 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది.

లెక్కింపు ఫలితాల్లో అధ్యక్షుడిగా రామకృష్ణ, ఉపాధ్యక్షుడిగా పవన్‌కుమార్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షురాలు (మహిళ)గా ఎం. లక్ష్మణకుమారి, సంయుక్త కార్యదర్శి (ఆర్గనైజింగ్)గా కె.వి. రాజేంద్రప్రకాష్, సంయుక్త కార్యదర్శి (మహిళ)గా పి. సునీత, సంయుక్త కార్యదర్శి (స్పోర్ట్స్)గా ఇ. మధుబాబు రామకృష్ణ ప్యానెల్ నుండి విజయం సాధించారు. 
Ramakrishna
AP Secretariat Employees Union
Andhra Pradesh
Secretariat Employees Elections
Napa Prasad
Kotla Rajesh
Employee Unions
Pawan Kumar
AP Government
M Lakshmanakumari

More Telugu News