మహిళ హత్య కేసు.. కూకట్‌పల్లి కోర్టు సంచలన తీర్పు
- 2011లో జరిగిన హత్య కేసులో తీర్పు వెలువరించిన కోర్టు
- నిందితుడు కరణ్ సింగ్‌కు మరణశిక్ష విధించిన కోర్టు
- 14 ఏళ్ల తర్వాత నిందితుడికి శిక్ష ఖరారు
హైదరాబాద్‌లో జరిగిన ఒక హత్య కేసులో కూకట్‌పల్లి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులోని నిందితుడికి మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్ నగర్‌లో 2011లో జరిగిన హత్య కేసులో కోర్టు ఈ తీర్పును వెలువరించింది. ఈ కేసులో నిందితుడు కరణ్ సింగ్‌కు మూడవ అదనపు డిస్ట్రిక్ట్ జడ్జి వెంకటేశ్వర రావు మరణశిక్ష విధిస్తూ తీర్పును వెలువరించారు. నిందితుడికి 14 సంవత్సరాల తర్వాత శిక్ష పడింది.
కరణ్ సింగ్ 2011లో ఒక మహిళను హత్య చేశాడు. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ హత్య జరిగిందని పోలీసుల విచారణలో తేలింది. అప్పటి సనత్ నగర్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ రాము ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్న పోలీసులకు, అధికారులకు సీపీ అవినాశ్ మహంతి అభినందనలు తెలిపారు.