Kuldeep Sengar: కుల్దీప్ సెంగర్‌కు మరణశిక్ష పడేవరకు నా పోరాటం ఆగదు: ఉన్నావ్ బాధితురాలు

Kuldeep Sengar Death Sentence My Fight Wont Stop Says Unnao Victim
  • మరణశిక్ష పడితేనే నాకు, నా తండ్రికి న్యాయం జరుగుతుందన్న బాధితురాలు
  • న్యాయవ్యవస్థపై అపార నమ్మకం ఉందన్న బాధితురాలు
  • తండ్రి గురించి కుల్దీప్ సెంగర్ కూతురు కూడా ఎక్స్ వేదికగా బహిరంగ లేఖ
కుల్దీప్ సెంగర్‌కు మరణశిక్ష పడేవరకు తన పోరాటం ఆగదని ఉన్నావ్ అత్యాచార బాధితురాలు అన్నారు. కుల్దీప్‌కు జైలు శిక్షను రద్దు చేసి, బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఆయనకు ఉరిశిక్ష పడినప్పుడే తన తండ్రికి, తనకు న్యాయం జరుగుతుందని ఆమె అన్నారు. న్యాయవ్యవస్థపై తనకు అపార నమ్మకం ఉందని ఆమె పేర్కొన్నారు.

బాధితురాలి తండ్రి హత్య కేసులోనూ కుల్దీప్ దోషిగా తేలినట్లు సీబీఐ తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. ఆయన అక్రమంగా తుపాకీని కలిగి ఉన్నారనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు. అయనను రిమాండుకు పంపించగా, 2018, ఏప్రిల్ 9న కస్టడీలో మరణించారు.

కుల్దీప్ కుమార్తె బహిరంగ లేఖ

మరోవైపు, తన తండ్రికి న్యాయం జరగాలని కోరుతూ నిందితుడు కుల్దీప్ సెంగర్ కుమార్తె ఇషిత ఎక్స్ వేదికగా బహిరంగ లేఖను విడుదల చేశారు. తన తండ్రి ఎదుర్కొంటున్న విచారణ కారణంగా తమ కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఒక కుమార్తెగా తాను ఎంతో అలసిపోయానని, ఇంకా ఏదో చిన్న ఆశ మిగిలి ఉందని ఆమె పేర్కొన్నారు.
Kuldeep Sengar
Unnao Rape Case
Supreme Court
Delhi High Court
Isha Sengar
Justice
Victim

More Telugu News