Varsha Bollamma: ఓటీటీకి వచ్చేస్తున్న మిస్టరీ థ్రిల్లర్!

Constable Kanakam Season 2 Update
  • తెలుగు సిరీస్ గా 'కానిస్టేబుల్ కనకం'
  • 6 ఎపిసోడ్స్ గా ఆకట్టుకున్న సిరీస్
  • ప్రధానమైన పాత్రలో మెప్పించిన వర్ష బొల్లమ్మ 
  • జనవరి 8వ తేదీ నుంచి సీజన్ 2

'కానిస్టేబుల్ కనకం' .. తెలుగులో వచ్చిన మిస్టరీ థ్రిల్లర్ సిరీస్. ఈ ఏడాది ఆగస్టు 14వ తేదీన ఈ సిరీస్ 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ కి వచ్చింది. సస్పెన్స్ .. హారర్ ను టచ్ చేస్తూ సాగే ఈ మిస్టరీ థ్రిల్లర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో, ప్రధానమైన పాత్రలో వర్ష బొల్లమ్మ నటించగా,  రాజీవ్ కనకాల .. అవసరాల కీలకమైన పాత్రలను పోషించారు. 6 ఎపిసోడ్స్ గా వచ్చిన ఈ సిరీస్ నుంచి ఇప్పుడు సీజన్ 2 రానుంది. 

1998 కాలంలో ఈ కథ మొదలవుతుంది. 'రేపల్లె' విలేజ్ కి సమీపంలోని 'అడవిగుట్ట' దిశగా వెళ్లడానికి ఆ గ్రామస్తులు చాలా భయపడుతూ ఉంటారు. అందుకు కారణం అటువైపు వెళ్లినవారు తిరిగి రాకపోవడమే. దాంతో చీకటిపడితే బయటకి రావడానికి జనాలు భయపడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితులలోనే, పోలీస్ కానిస్టేబుల్ గా కనకం ఆ గ్రామానికి వస్తుంది. జరుగుతున్న సంఘటనలు ఆమెకి అనేక రకాల సందేహాలను కలిగిస్తాయి. 

ఆ గ్రామ సర్పంచ్ తీరు కూడా ఆమెకి అనుమానాన్ని కలిగిస్తుంది. చంద్రిక అనే అమ్మాయి మిస్సింగ్ వెనుక గల కారణం ఏమిటో తెలుకోవాలనే ఉద్దేశంతో కనకం రంగంలోకి దిగుతుంది. అక్కడి నుంచి మిగిలిన కథ సీజన్ 2లో పరిగెత్తనుంది. జనవరి 8వ తేదీ నుంచి సీజన్ 2 స్ట్రీమింగ్ కానుంది. మొదటి సీజన్లో మంచి మార్కులు కొట్టేసిన ఈ సిరీస్, సీజన్ 2లో ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకుంటుందనేది చూడాలి.

Varsha Bollamma
Constable Kanakam
ETV Win
Telugu thriller series
Rajeev Kanakala
Avasarala Srinivas
Mystery thriller
Telugu OTT
Repalle village
Adavigutta

More Telugu News