Abdul Wahab Saheb Qasimi Rashadi: ప్రముఖ ఇస్లామీయ పండితుడు రహిమహుల్లాహ్ మృతికి ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భాంతి
- హజ్రత్ మౌలానా ముఫ్తీ అబ్దుల్ వహాబ్ సాహెబ్ ఖాసిమీ రషాది (రహిమహుల్లాహ్) కన్నుమూత
- 50 సంవత్సరాలుగా రాష్ట్ర తబ్లిక్- ఏ- జమాత్ అధ్యక్షుడిగా, 2008 నుండి రాష్ట్ర జమీయత్ - ఉలమా గౌరవ అధ్యక్షుడిగా ఉన్నారన్న చంద్రబాబు
- తన జీవితాన్ని పూర్తిగా అల్లాహ్ దీన్ సేవకు అంకితం చేసిన ధార్మిక ప్రబోధకుడన్న నారా లోకేశ్
ప్రముఖ ఇస్లామీయ పండితుడు, ఫిఖా (ఇస్లామీయ న్యాయ నిపుణుడు), సమాజానికి మార్గదర్శకుడిగా పేరుగాంచిన మహనీయులు, నెల్లూరుకు చెందిన హజ్రత్ మౌలానా ముఫ్తీ అబ్దుల్ వహాబ్ సాహెబ్ ఖాసిమీ రషాది (రహిమహుల్లాహ్) మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఆయన మృతిపై ఎక్స్ వేదికగా స్పందించిన చంద్రబాబు.. రహిమహుల్లాహ్ తన జీవితంలో 60 సంవత్సరాలకు పైగా కాలాన్ని ఇస్లామీయ విద్య, ఖుర్ఆన్-హదీస్ బోధన, జామియా నూరుల్ హుదా మద్రసా సేవకు అంకితం చేశారని కొనియాడారు. 50 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తబ్లిగ్-ఏ-జమాత్ అధ్యక్షులుగా, 2008 నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జమీయత్-ఉలమా గౌరవ అధ్యక్షులుగా ఉన్నారన్నారు.
అరబీ సాహిత్యం, ఫిఖ్, హదీస్, ఇతర ఇస్లామీయ శాస్త్రాలలో ప్రావీణ్యం సాధించారని, అనేక ఇస్లామీయ విద్యా విభాగాలలో సంపూర్ణ అవగాహన కలిగిన జయ్యద్ ఆలిం ధార్మిక, సామాజిక సేవలలో అంకితమయ్యారని పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానన్నారు. మంత్రి నారా లోకేశ్ కూడా ఆయన మృతికి సంతాపం తెలియజేశారు. తన జీవితాన్ని పూర్తిగా అల్లాహ్ దీన్ సేవకు అంకితం చేసిన ధార్మిక ప్రబోధకునికి స్వర్గప్రాప్తి కలగాలని అల్లాను ప్రార్ధిస్తున్నానని లోకేశ్ ట్వీట్ చేశారు.