ఇదెక్కడి వంటకంరా బాబూ.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'బిర్యానీ ఐస్‌క్రీమ్'!
- ఫుడ్ వ్లాగర్ తయారుచేసిన వంటకం
- బిర్యానీ దినుసులతోనే ఐస్‌క్రీమ్ తయారీ
- ఈ వింత వంటకంపై నెటిజన్ల మిశ్రమ స్పందన
ఓ ఫుడ్ వ్లాగర్ ఈ బిర్యానీ ఐస్‌క్రీమ్‌ను తయారు చేశారు. అచ్చం బిర్యానీకి వాడే దినుసులనే దీని తయారీలోనూ ఉపయోగించడం గమనార్హం. ముందుగా నూనె, ఉప్పు వేసి ఉల్లిపాయలను బ్రౌన్‌గా వేయించారు. ఆ తర్వాత బియ్యాన్ని క్రీమ్‌తో కలిపి ఉడికించారు. అనంతరం ఈ మిశ్రమంలో పంచదార, బిర్యానీ మసాలా, వేయించిన ఉల్లిపాయలు, ఇతర సుగంధ ద్రవ్యాలు కలిపి మిక్సీ పట్టారు.
ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని వడగట్టి, వచ్చిన ద్రవాన్ని ఫ్రిజ్‌లో ఉంచి గడ్డకట్టేలా చేశారు. చివరగా దానిపై అలంకరణ కోసం వేయించిన ఉల్లిపాయలు, కొద్దిగా నెయ్యి, బాదం పలుకులు చల్లారు. అంతే.. బిర్యానీ ఐస్‌క్రీమ్ సిద్ధమైంది.
ఈ విచిత్ర రెసిపీపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. "దీన్ని ఒకసారి రుచి చూస్తే కానీ నమ్మలేం" అని ఒకరు కామెంట్ చేయగా, "ఇది చూడటానికి వింతగా ఉన్నా, చేసిన విధానం చాలా బాగుంది" అని మరొకరు అభిప్రాయపడ్డారు. "అన్నీ బాగున్నాయి కానీ ఇందులో చికెన్, గుడ్లు, బంగాళాదుంపలు మిస్ అయ్యాయి" అని ఓ నెటిజన్ చమత్కరించారు. "ప్రతిదీ చేయగలమని ప్రయోగం చేయకూడదు" అంటూ మరికొందరు విమర్శిస్తున్నారు. మొత్తానికి, ఈ బిర్యానీ ఐస్‌క్రీమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
More Telugu News
మోదీకి చంద్రబాబు వంటి నేతలు తోడైతే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది: సజ్జన్ జిందాల్
![]()
లెక్కలు తప్పైతే రాజీనామా చేస్తా.. మీరు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా?: జూపల్లి
![]()
హైదరాబాద్‌లో దారుణం: ఫ్రెండ్‌తో వీడియో కాల్ మాట్లాడుతూనే మహిళ ఆత్మహత్య
![]()
రాయలసీమ ఉక్కు కల సాకారం.. జేఎస్‌డబ్ల్యూ ప్లాంట్ పనులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
![]()
‘రామాలయ దోపిడీని హిందువులు క్షమించరు’.. బీజేపీపై ఉద్ధవ్ ఠాక్రే ఫైర్
![]()
అప్పుల లెక్కల్లో పొంతన లేదు.. మంత్రి చెప్పింది ఒకటి.. సీఎం చెప్పింది మరొకటి: హరీశ్ రావు
![]()
సైన్స్ ఫిక్షన్ కాదు.. కృత్రిమ గుడ్డుతో కోడిపిల్ల పుట్టింది!
![]()
కుర్రాడిపై ఎందుకీ జాప్యం?.. వైభవ్ విషయంలో టీమిండియాపై డివిలియర్స్ ఫైర్!
![]()
నన్ను ఇరికిస్తున్నారు.. థర్డ్ డిగ్రీ వాడకుండా చూడండి: కోర్టుకు సీఐ నాగరాజు లేఖ
![]()
భవిష్యత్తు భయంతోనే ఆ పని చేశా: అమితాబ్ బచ్చన్
![]()
దుబాయ్ మోడల్.. వారానికి 3 రోజుల సెలవులు.. భారతీయుల కల నెరవేరేనా?
![]()
ఆ చైనా యాప్‌లను తొలగించండి.. ఈ-రిక్షాల నిలిపివేతపై కేంద్రం సీరియస్!
![]()
సినీ నిర్మాతను మోసం చేసిన షబ్బీర్ అలీ అల్లుడు.. కేసు నమోదు
![]()
14 రోజుల బ్యాటరీతో హువావే బ్యాండ్ 11 సిరీస్.. ధర ఫీచర్లివే..
![]()
హనీమూన్ హత్య కేసు: సోనమ్ బెయిల్‌పై స్టేకు సుప్రీం నిరాకరణ.. కీలక వ్యాఖ్యలు
![]()