Sun: వైద్యంలో అద్భుతం.. తెగిపడిన చెవికి పాదంపై పునర్జన్మ!

Medical Miracle Suns Ear Grown on Foot and Reattached
  • ఫ్యాక్టరీలో పని చేస్తుండగా ఇరుక్కున్న మహిళ జుత్తు
  • ఎడమ చెవి సహా ఊడొచ్చిన చర్మం
  • తెగిన చెవి భాగాన్ని సజీవంగా ఉంచేందుకు 'హెటెరోటోపిక్ సర్వైవల్' పద్ధతిలో పాదానికి అమర్చిన వైద్యులు
  • శస్త్రచికిత్సకు 10 గంటల సమయం
  • ఐదు నెలల తర్వాత చెవి యథాస్థానంలో అమరిక
చైనాలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్‌కు చెందిన సన్ అనే మహిళ ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె జుత్తు యంత్రంలో చిక్కుకుంది. ఆ వేగానికి తల ఎడమవైపు చర్మం ఊడి రావడంతో పాటు చెవి పూర్తిగా తెగిపోయింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు రక్తనాళాలు తీవ్రంగా దెబ్బతినడంతో వెంటనే చెవిని తిరిగి అమర్చడం సాధ్యం కాదని చెప్పారు.

చెవికి రక్తప్రసరణ అందకపోతే అది కుళ్లిపోయే ప్రమాదం ఉండటంతో వైద్యులు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. పాదం పైభాగంలో చర్మం పల్చగా ఉండటంతో పాటు అక్కడి రక్తనాళాలు చెవి రక్తనాళాల పరిమాణంలోనే ఉంటాయి. కాబట్టి పాదానికి చెవిని అమర్చారు. అక్కడ తల వెంట్రుకల కంటే సన్నగా ఉండే రక్తనాళాలు ఉండటంతో ఈ క్లిష్టమైన మైక్రో సర్జరీకి 10 గంటల సమయం పట్టింది.

చెవి సురక్షితంగా పెరగడానికి సన్ ఐదు నెలల పాటు వదులుగా ఉండే బూట్లను ధరించారు. ఐదు నెలల నిరీక్షణ తర్వాత పాదంపై ఉన్న చెవిని తీసి, తల భాగంలో విజయవంతంగా అమర్చారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. గతంలో కూడా చైనా వైద్యులు రోగి భుజంపై చెవిని పెంచి అరుదైన రికార్డులు సృష్టించారు.
Sun
Ear
China
Foot
Surgery
Medical Miracle
Shandong Province
Microsurgery

More Telugu News