BR Naidu: అలిపిరి మెట్ల మార్గంలో శ్రీవారి భక్తుల కోసం ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు

BR Naidu Inaugurates First Aid Center for Pilgrims at Alipiri
  • తిరుమల ఘాట్ రోడ్డులోని ఏడో మైలు వద్ద ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ను ప్రారంభించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
  • భక్తులకు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్య సేవలు అందించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడి
  • కార్యక్రమంలో పాల్గొన్న ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సి.హెచ్‌. వెంకయ్య చౌదరి
అలిపిరి మెట్ల మార్గంలో వచ్చే భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే దిగువ ఘాట్ రోడ్డులోని ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌ను టీటీడీ ఛైర్మన్ బీఆర్‌ నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సి.హెచ్‌. వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా ఛైర్మన్ బీఆర్‌ నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. నడకదారి ద్వారా తిరుమల చేరుకునే భక్తుల సౌకర్యార్థం ఏడో మైలు వద్ద ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులకు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్య సేవలు అందించే ఉద్దేశంతో ఈ కేంద్రాన్ని ప్రారంభించామన్నారు.
 
శ్రీవారి మెట్టు మార్గంలో కూడా ఇప్పటికే ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. భక్తుల భద్రత, ఆరోగ్య పరిరక్షణకు టీటీడీ ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటోందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
BR Naidu
TTD
Tirumala
Alipiri
First Aid Center
Pilgrims
Tirupati
Srivari Mettu
Health Camp

More Telugu News