ఆరెస్సెస్ ను అల్ ఖైదాతో పోల్చిన మాణికం ఠాగూర్... బీజేపీ ఫైర్
- ఆరెస్సెస్ నుంచి నేర్చుకోవాల్సింది ఏమీ లేదన్న మాణికం ఠాగూర్
- విద్వేషం పెంపొందిస్తోందని విమర్శల
- ఠాగూర్‌పై పరువునష్టం దావా వేస్తామని బీజేపీ హెచ్చరిక
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) పై కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆరెస్సెస్ ను సంస్థ అల్ ఖైదా ఉగ్రవాద సంస్థతో పోల్చుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఠాగూర్‌పై పరువునష్టం దావా వేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించింది.
వివరాల్లోకి వెళితే, కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ మాట్లాడుతూ, "ఆరెస్సెస్ ఒక విద్వేషపూరిత సంస్థ. అది విద్వేషాన్ని వ్యాప్తి చేస్తుంది, విద్వేషాన్ని పెంచి పోషిస్తుంది. ఆ సంస్థ నుంచి నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. అల్ ఖైదా ఎలాగైతే రక్తపాతంతో పనిచేస్తుందో, దేశంలో ఆరెస్సెస్ కూడా విద్వేషాన్ని వ్యాప్తి చేస్తూ అదే పని చేస్తోంది" అని తీవ్ర విమర్శలు చేశారు.
ఆరెస్సెస్ సంస్థాగత శక్తిని ప్రశంసిస్తూ దిగ్విజయ్ సింగ్ చేసిన సోషల్ మీడియా పోస్ట్‌పై స్పందిస్తూ ఠాగూర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు అగ్రనేతల పాదాల వద్ద కూర్చున్న క్షేత్రస్థాయి కార్యకర్త (నరేంద్ర మోదీ) ప్రధాని కాగలగడం వారి సంస్థాగత శక్తికి నిదర్శనమని దిగ్విజయ్ పేర్కొన్నారు.
మాణికం ఠాగూర్ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ఆర్.పి. సింగ్ ఘాటుగా స్పందించారు. "మాణికం ఠాగూర్ మాట్లాడే ముందు పదిసార్లు ఆలోచించుకోవాలి. లేకపోతే పరువునష్టం దావా ఎదుర్కోవాల్సి ఉంటుంది" అని హెచ్చరించారు.
దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలను ఆర్.పి. సింగ్ సమర్థిస్తూ, బీజేపీలో సామాన్య కార్యకర్త కూడా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కాగలరని, కానీ కాంగ్రెస్‌లో మాత్రం సోనియా, రాహుల్, ప్రియాంక అంటూ ఒకే కుటుంబం చుట్టూ రాజకీయాలు నడుస్తాయని విమర్శించారు. కాంగ్రెస్‌లో ఇప్పుడు విశ్వసనీయ నాయకుడు లేరని, ప్రజల ముందు ఉంచడానికి సరైన విధానాలు కూడా లేవని ఆయన ఎద్దేవా చేశారు.