Chandrababu Naidu: అయోధ్య బాలరాముడ్ని దర్శించుకున్న సీఎం చంద్రబాబు.... ఫొటోలు ఇవిగో!

Chandrababu Naidu Visits Ayodhya Balram Temple
  • అయోధ్య రామజన్మభూమిని సందర్శించిన సీఎం చంద్రబాబు
  • బాలరాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి
  • ఇదొక ప్రశాంతమైన, ఆధ్యాత్మిక అనుభూతి అన్న చంద్రబాబు
  • ఆలయ నిర్మాణ విశేషాలను అడిగి తెలుసుకున్న సీఎం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం నాడు అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన బాలరాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి వెంట పలువురు నేతలు ఉన్నారు.

దర్శనం అనంతరం ఆలయ నిర్వాహకులు చంద్రబాబుకు ఆలయ నిర్మాణ శైలి, ఇతర విశేషాలను వివరించారు. ఆయన ఆసక్తిగా ఆలయ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటన తనకు ఎంతో ప్రశాంతమైన, ఆధ్యాత్మిక అనుభూతిని ఇచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు.

ఈ పర్యటనపై చంద్రబాబు స్పందిస్తూ, "ఈరోజు అయోధ్యలోని దివ్యమైన, అద్భుతమైన శ్రీరామ జన్మభూమి మందిరంలో స్వామివారిని దర్శించుకుని పూజలు చేసుకునే భాగ్యం కలిగింది. మరోసారి ఇక్కడికి రావడం ఎంతో శాంతియుతంగా, ఆధ్యాత్మికంగా అనిపించింది. శ్రీరాముడి విలువలు, ఆదర్శాలు మనందరికీ శాశ్వతమైన పాఠాలు. అవి మనకు ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తూ, స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిస్తున్నాను" అని తెలిపారు.

అంతకుముందు, బాలరాముడి దర్శనార్థం అయోధ్య చేరుకున్న చంద్రబాబుకు దేవాలయ అధికారులు, ఉత్తరప్రదేశ్ ఎన్డీఏ నాయకులు ఘన స్వాగతం పలికారు.
Chandrababu Naidu
Ayodhya
Ram Janmabhoomi
Balram Idol
Andhra Pradesh CM
Uttar Pradesh
Temple Visit
Hindu Temple
Spiritual Journey
NDA Leaders

More Telugu News