రాజు వెడ్స్ రాంబాయి... కొత్త యూజర్లకు ఈటీవీ విన్ ఆఫర్

  • బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న రాజు వెడ్స్ రాంబాయి మూవీ 
  • ఓటీటీలోనూ సంచలన రికార్డులు నమోదు చేసుకుంటున్న వైనం
  • మూవీని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపిన ఈటీవీ విన్
అఖిల్, తేజస్విరావ్ జంటగా నటించిన 'రాజు వెడ్స్ రాంబాయి' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడమే కాకుండా, ఓటీటీలోనూ సంచలన రికార్డులు నెలకొల్పుతోంది. ఈ చిత్రానికి సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. దర్శకుడు వేణు ఊడుగులతో కలిసి రాహుల్ మోపిదేవి నిర్మించగా, చైతు జొన్నలగడ్డ, అనిత చౌదరి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించారు.

ఈ నెల 18 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఇప్పటివరకు ఈ చిత్రం 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను దాటినట్లు ఈటీవీ విన్ అధికారికంగా వెల్లడించింది. థియేటర్లలో 2 గంటల 15 నిమిషాల నిడివితో విడుదలైన ఈ చిత్రం, ఓటీటీలో ప్రేక్షకులను మరింత ఆకట్టుకునేలా ఎక్స్‌టెండెడ్ కట్‌తో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ విజయోత్సాహంలో భాగంగా ఈటీవీ విన్ ప్రత్యేక ఆఫర్‌ను కూడా ప్రకటించింది. నెలవారీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకునేవారు RWR50 కోడ్‌ను ఉపయోగిస్తే రూ.50 రాయితీ, అలాగే, వార్షిక సబ్‌స్క్రిప్షన్‌కు RWR100 కోడ్‌ ద్వారా రూ.100 తగ్గింపు పొందవచ్చని ప్రకటించింది.

'రాజు వెడ్స్ రాంబాయి' చిత్రాన్ని మళ్లీ మళ్లీ వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఈటీవీ విన్ ధన్యవాదాలు తెలియజేసింది. 


More Telugu News