అండర్-19 ప్రపంచ కప్ కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ
- టోర్నీకి ఆతిథ్యమిస్తున్న జింబాబ్వే, నమీబియా
- ఆయుష్ మాత్రే సారథ్యంలో జట్టును ప్రకటించిన బీసీసీఐ
- జనవరి ప్రారంభంలో దక్షిణాఫ్రికాతో ఆడనున్న ఇదే జట్టు
వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానున్న ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్-2026కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. జింబాబ్వే, నమీబియా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీ జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరగనుంది. ముంబై ఓపెనర్ ఆయుష్ మాత్రే సారథ్యంలో జట్టును ప్రకటించింది. విహాన్ మల్హోత్రాను వైస్ కెప్టెన్‌గా నియమించింది.
ఈ జట్టులో 14 ఏళ్ల బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కింది. ఈ సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
ఆయుష్ మాత్రే (కెప్టెన్), విహాన్ మల్హోత్రా (వైస్ కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు, హర్వాన్ష్ సింగ్ (వికెట్ కీపర్), అంబ్రిష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, మొహమ్మద్ ఎనాన్, హెనిల్ పటేల్, దీపేశ్, కిషన్ కుమార్, ఉద్ధవ్ మోహన్.
ఇదే యువ జట్టు వరల్డ్ కప్ కు ముందు... జనవరి 3, 5, 7 తేదీల్లో దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ టూర్ లో భారత జట్టుకు వైభవ్ సూర్యవంశీ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. ఈ సిరీస్ కు గాయాల కారణంగా ఆయుష్ మాత్రే, విహాన్ మల్హోత్రా అందుబాటులో ఉండడం లేదు. వారు వరల్డ్ కప్ సమయానికి జట్టుతో కలుస్తారు.