పెరిగిన బంగారం, వెండి ధరలు: పసిడి రూ.1.43 లక్షలు... నెల రోజుల్లో రూ.80 వేలు పెరిగిన వెండి
- హైదరాబాద్‌లో రూ.1.43 వేలు పలికిన 24 క్యారెట్ల బంగారం ధర
- రూ.2.50 లక్షలకు పెరిగిన కిలో వెండి ధర
- 2025 క్యాలెండర్ ఏడాదిలో 70 శాతం పెరిగిన పసిడి
బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. హైదరాబాద్ నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,000 పలికి గరిష్ఠ స్థాయికి చేరుకుంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,31,000గా ఉంది. వెండి కిలో ధర రూ.2,50,000కు చేరుకుంది. నెల రోజుల్లోనే వెండి ధర రూ.80,000కు పైగా పెరగడం గమనార్హం.
ప్రస్తుత క్యాలెండర్ ఏడాది (2025)లో పసిడి ధర 70 శాతం పెరిగింది. ఒక క్యాలెండర్ ఏడాదిలో బంగారం ఇంత భారీగా పెరగడం సుమారు 45 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి అని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. భౌగోళిక, రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో 2026 ప్రారంభంలోనూ పసిడి ధరలు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాల కంటే తక్కువగా ఉండటంతో, ఫెడరల్ రిజర్వ్ తదుపరి సమీక్షలో వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు పెరుగుతున్నాయి. ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతుండటంతో, సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం, వెండి వైపు పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారు.