నీ పోరాటం కొనసాగించు... అనసూయకు ప్రకాశ్ రాజ్ మద్దతు
- హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై నటుడు శివాజీ వ్యాఖ్యలతో మొదలైన వివాదం
- "మా శరీరం, మా ఇష్టం" అంటూ గట్టిగా బదులిచ్చిన అనసూయ
- అనసూయకు మద్దతుగా నిలిచిన ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్
- కొందరు మొరుగుతూనే ఉంటారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన ప్రకాశ్ రాజ్
- ఎవరేమన్నా తలవంచేది లేదన్న అనసూయ
హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలతో మొదలైన వివాదం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో నటి అనసూయ భరద్వాజ్‌కు ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తన మద్దతు తెలిపారు. విమర్శలపై ఆయన ఘాటుగా స్పందించారు.
"సంస్కారులు అని చెప్పుకునే వాళ్లను మొరుగుతూనే ఉండనివ్వండి. అది వారి నీచమైన మనస్తత్వం. నువ్వు మాత్రం తల ఎత్తుకుని నిలబడు డియర్ అనసూయ, మేమంతా నీతోనే ఉన్నాం... నీ పోరాటం కొనసాగించు. నీకు మరింత శక్తి చేకూరాలి" అని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు.
ఇటీవల నటుడు శివాజీ హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై అనసూయ స్పందిస్తూ "మా శరీరం, మా ఇష్టం" అంటూ గట్టిగా బదులిచ్చారు. ఈ నేపథ్యంలో ఆమెపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. దీనిపై మరోసారి స్పందించిన అనసూయ, "ఏది ఏమైనా నేను ఎప్పుడూ తల ఎత్తుకొనే ఉంటాను. నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. సమాజంలో వినిపించని, పట్టించుకోని ఒక వర్గం గొంతుకను నేను వినిపిస్తున్నాను" అని తన వైఖరిని స్పష్టం చేశారు.