చిరు-వెంకీల మాస్ జాతర.. ‘మన శంకరవరప్రసాద్ గారు’ సాంగ్ ప్రోమో విడుదల

  • సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతున్న చిరంజీవి సినిమా
  • ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రంలో వెంకటేశ్‌ కీలక పాత్ర
  • ‘ఆర్ యూ రెడీ’ సాంగ్ ప్రోమోను విడుదల చేసిన చిత్రయూనిట్
  • ఈ నెల‌ 30న విడుదల కానున్న పూర్తి పాట
సంక్రాంతి బరిలో నిలవనున్న మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’ నుంచి ఓ అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలోని ‘ఆర్ యూ రెడీ’ అనే మాస్ సాంగ్ ప్రోమోను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఈ పాటలో చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ కలిసి స్టెప్పులేయడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ఈ ప్రోమోలో మెగాస్టార్ తనదైన గ్రేస్‌తో అదరగొడితే, వెంకటేశ్‌ తన మార్క్ స్టైల్‌తో ఆకట్టుకున్నారు. ఇద్దరు అగ్ర తారలను ఒకే ఫ్రేమ్‌లో చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. విడుదలైన కొద్దిసేపటికే ఈ సాంగ్ ప్రోమో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ చిత్రంలో వెంకీ ఓ కీలకమైన అతిథి పాత్రలో నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 12 విడుద‌ల కానుంది. ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పూర్తి పాటను డిసెంబర్ 30న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.



More Telugu News