Salman Khan: పన్వేల్ ఫామ్‌హౌస్‌లో సల్మాన్ ఖాన్ 60వ బర్త్‌డే.. హాజరైన ధోనీ, బాలీవుడ్ సెల‌బ్రిటీలు

Salman Khan Celebrates 60th Birthday with Dhoni Bollywood Stars
  • హాజరైన కుటుంబ సభ్యులు, బాలీవుడ్ ప్రముఖులు
  • వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా సంజయ్ దత్, క్రికెటర్ ధోనీ
  • ప్ర‌స్తుతం ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ చిత్రంలో నటిస్తున్న సల్మాన్
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ 60వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా తన పన్వేల్ ఫామ్‌హౌస్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకకు సినీ, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై సందడి చేశారు.

సల్మాన్ తల్లిదండ్రులు సలీం ఖాన్, సల్మా ఖాన్ వేడుక ప్రాంగణం వద్ద కనిపించారు. సోదరులు అర్బాజ్ ఖాన్ తన భార్య షురా ఖాన్, వారి నవజాత శిశువుతో కలిసి హాజరు కాగా, సోహైల్ ఖాన్ కూడా పాల్గొన్నారు. సోదరీమణులు అర్పితా ఖాన్ శర్మ, అల్విరా ఖాన్ అగ్నిహోత్రి తమ కుటుంబాలతో కలిసి ఈ వేడుకలో పాలుపంచుకున్నారు.

ఈ పార్టీకి నటులు సంజయ్ దత్, ఆదిత్య రాయ్ కపూర్, క్రికెటర్ ఎంఎస్ ధోనీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరితో పాటు రితేశ్‌ దేశ్‌ముఖ్ తన భార్య జెనీలియా, కుమారులతో విచ్చేశారు. అలాగే సంగీతా బిజ్లానీ, మహేశ్‌ మంజ్రేకర్, హుమా ఖురేషి, మికా సింగ్, మనీశ్ పాల్ వంటి పలువురు ప్రముఖులు సల్మాన్‌ పుట్టినరోజు వేడుక‌ల‌కు హాజ‌ర‌య్యారు.

ఇక, సినిమాల విషయానికొస్తే.. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం అపూర్వ లఖియా దర్శకత్వంలో "బ్యాటిల్ ఆఫ్ గల్వాన్" అనే చిత్రంలో నటిస్తున్నారు. 2020లో గల్వాన్ లోయలో భారత, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే.
Salman Khan
Bollywood
Salman Khan birthday
MS Dhoni
Panvel farmhouse
Battle of Galwan
Sanjay Dutt
Arbaaz Khan
Bollywood celebrities

More Telugu News