Brian Armstrong: హైదరాబాద్ పోలీసులకు థ్యాంక్స్ చెప్పిన అమెరికన్‌ సీఈఓ.. ఎందుకంటే..!

Coinbase CEO Brian Armstrong Praises Hyderabad Police for Cybercrime Arrest
  • క్రిప్టో కరెన్సీ సంస్థ కాయిన్ బేస్ పై ఇటీవల హ్యాకర్ల దాడి
  • తమ కస్టమర్ల డేటాను దొంగిలించే యత్నం జరిగిందన్న కాయిన్ బేస్ సీఈఓ
  • నిందితులకు సహకరించిన కాయిన్ బేస్ మాజీ సర్వీస్ ఏజెంట్.. అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు
అమెరికాకు చెందిన కాయిన్ బేస్ సంస్థ సీఈఓ బ్రియాన్ ఆర్మ్ స్ట్రాంగ్ హైదరాబాద్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. సైబర్ దుండగులను చాకచక్యంగా అరెస్టు చేశారంటూ ప్రశంసలు గుప్పించారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. సైబర్ దుండగుల విషయంలో తమ కంపెనీ ‘జీరో టాలరెన్స్’ విధానం పాటిస్తుందని ఆయన చెప్పారు.

అసలు ఏం జరిగిందంటే..
కాయిన్‌ బేస్‌ సంస్థ క్రిప్టో కరెన్సీకి సంబంధించిన కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ సంస్థపై ఇటీవల హ్యాకర్లు దాడి చేశారు. సంస్థకు చెందిన కస్టమర్ల డేటాను దొంగిలించి, 20 మిలియన్ డాలర్లను డిమాండ్ చేశారు. హ్యాకర్లకు సహకరించిన ఆ ఏజెంట్ భారతీయుడని బ్రియాన్ తన పోస్టులో పేర్కొన్నారు.

తాజాగా ఆ నిందితుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారని చెబుతూ.. మన పోలీసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘హైదాబాద్ పోలీసులకు ధన్యవాదాలు. హ్యాకర్లకు సహకరించిన మిగతా వారికి కూడా ఇదే పరిస్థితి రానుంది’ అని బ్రియాన్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ పేర్కొన్నారు.
Brian Armstrong
Coinbase
Hyderabad Police
Cyber Crime
Cyber Attack
Cryptocurrency
Data Theft
Extortion
Cyber Security
India

More Telugu News