ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం .. ఒక రోజు ముందే జనవరి పింఛన్ల పంపిణీ

  • ఈ నెల 31నే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయాలన్న ప్రభుత్వం
  • పింఛన్ నగదును 30వ తేదీనే బ్యాంకుల నుంచి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు విత్‌డ్రా చేసుకోవాలని ఆదేశం
  • డీఆర్‌డీఏ పీడీలు అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని సూచన
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద జనవరి నెలకు సంబంధించిన సామాజిక భద్రత పింఛన్‌ను డిసెంబర్ 31న, అంటే ఒక రోజు ముందుగానే లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలు నూతన సంవత్సర వేడుకలు జరుపుకోనున్న నేపథ్యంలో ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి ఈ ఆదేశాలు జారీ చేసింది.

పింఛన్లకు సంబంధించిన నగదును డిసెంబర్ 30వ తేదీనే బ్యాంకుల నుంచి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు విత్‌డ్రా చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా డీఆర్‌డీఏ పీడీలు అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది. 


More Telugu News