ఐఫోన్ 18 ప్రో మాక్స్ వివరాలు లీక్.. రిలీజ్ ఎప్పుడంటే..!

  • సరికొత్త డిజైన్, మెరుగైన కెమెరా సహా అదిరిపోయే ఫీచర్లు
  • ధర 1.70 లక్షల వరకు ఉండే అవకాశం
  • అధికారిక ప్రకటన కోసం వేచి ఉండాలంటున్న నిపుణులు
ఐఫోన్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆపిల్ కొత్త మోడల్ 'ఐఫోన్ 18 ప్రో మాక్స్' గురించి ఆసక్తికర విశేషాలు వెలుగులోకి వచ్చాయి. విప్లవాత్మక మార్పులతో రూపొందిస్తున్న ఈ ఫోన్ ను ఆపిల్ కంపెనీ 2026లో మార్కెట్లోకి రిలీజ్  చేయబోతున్నట్లు టెక్ వర్గాల సమాచారం. ఆపిల్ తన సంప్రదాయం ప్రకారం వచ్చే ఏడాది సెప్టెంబర్ లో ఈ మోడల్‌ను ప్రపంచ మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది. ఆపిల్ తన ప్రతి కొత్త మోడల్‌తో స్మార్ట్‌ఫోన్ రంగాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలిసిందే. అయితే ఈ వివరాలన్నీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న లీక్స్ ఆధారంగా మాత్రమే ఉన్నాయని, అధికారిక ప్రకటన కోసం మరికొంత కాలం వేచి చూడాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఐఫోన్ 18 ప్రో మాక్స్ ప్రత్యేకతలు..
A20 బయోనిక్ చిప్‌..
అత్యంత శక్తిమంతమైన A20 బయోనిక్ చిప్‌ ను ఈ ఫోన్ లో ఉపయోగించనున్నట్లు సమాచారం. ఈ చిప్ వల్ల ఫోన్ లో మల్టీ టాస్కింగ్ మరియు గేమింగ్ అనుభవాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్తుందని అంచనా.
48MP కెమెరా..
మెరుగైన సెన్సర్లతో కూడిన కెమెరా సెటప్‌ను ఆపిల్ ప్రవేశపెట్టనుంది. తక్కువ వెలుతురులోనూ అత్యంత నాణ్యమైన ఫోటోలు తీసేలా 48MP కన్నా ఎక్కువ సామర్థ్యం గల సెన్సర్లను వాడే అవకాశం ఉందని తెలుస్తోంది.
డిజైన్ లో మార్పులు..
అండర్ డిస్‌ ప్లే ఫేస్ ఐడీ టెక్నాలజీతో ఐఫోన్ 18 ప్రో మాక్స్ స్క్రీన్‌పై నాచ్ లేదా డైనమిక్ ఐలాండ్ పరిమాణాన్ని మరింత తగ్గించవచ్చని నివేదికలు చెబుతున్నాయి.
భారత్‌ లో ధర..
భారతదేశంలో ఐఫోన్ 18 ప్రో మాక్స్ ప్రారంభ ధర సుమారు రూ.1,60,000 నుంచి రూ.1,70,000 ల మధ్య ఉండవచ్చని అంచనా.


More Telugu News