Palestine man: నమాజ్ చేసుకుంటున్న పాలస్తీనా వ్యక్తిని వాహనంతో ఢీకొట్టిన ఇజ్రాయెల్ సైనికుడు.. వీడియో ఇదిగో!

Israeli Soldier Assaults Praying Palestinian Man in West Bank Video Surfaces
  • ఏటీవీ వాహనంతో ఢీకొట్టిన ఇజ్రాయెల్ రిజర్విస్ట్ సైనికుడు
  • ప్రపంచవ్యాప్తంగా విమర్శలు రావడంతో ఐడీఎఫ్ కఠిన చర్యలు
  • సైనికుడి నుంచి ఆయుధం తీసుకుని గృహ నిర్బంధంలో ఉంచిన వైనం
ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో ఇజ్రాయెల్ సైనికుడి క్రూరత్వం కెమెరాకు చిక్కింది. రోడ్డు పక్కన ప్రశాంతంగా నమాజ్ చేసుకుంటున్న ఒక పాలస్తీనియన్ పై, ఇజ్రాయెల్ రిజర్విస్ట్ సైనికుడు తన ఏటీవీ వాహనంతో ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అంతర్జాతీయంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వెస్ట్ బ్యాంక్ లోని దేర్ జరీర్ గ్రామ సమీపంలో ఒక పాలస్తీనియన్ రోడ్డు పక్కన నమాజ్ చేసుకుంటుండగా ఈ ఘటన జరిగింది. సివిల్ డ్రెస్ లో ఉన్న ఇజ్రాయెల్ సైనికుడు, తన వాహనంతో ఆ వ్యక్తిని ఢీకొట్టడమే కాకుండా.. కిందపడిపోయిన బాధితుడిపై అరుస్తూ, అక్కడి నుండి వెళ్లిపోవాలని బెదిరించాడు. ఈ దాడిలో బాధితుడి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాకుండా, సదరు సైనికుడు బాధితుడిపై పెప్పర్ స్ప్రే కూడా ప్రయోగించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

సైనికుడిపై ఇజ్రాయెల్ సైన్యం చర్యలు
ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో ఇజ్రాయెల్ రక్షణ దళం (ఐడీఎఫ్) స్పందించింది. నిందితుడైన సైనికుడు తన అధికార పరిధిని అతిక్రమించి, అత్యంత దారుణంగా ప్రవర్తించాడని పేర్కొంది. వెనువెంటనే అతడిని విధుల్లో నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే అతడి వద్ద ఉన్న ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని, ప్రస్తుతం అతడిని గృహనిర్బంధంలో ఉంచినట్లు సైనిక వర్గాలు తెలిపాయి.
Palestine man
Israel soldier
West Bank
Namaz
Palestinian
Israeli army
IDF
Human rights violation
Violence
Military misconduct

More Telugu News