వీళ్లిద్దరికీ కలిపి కొరియోగ్రఫీ జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం: పొలాకి విజయ్
- మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో చిరంజీవి, వెంకటేశ్ లపై ఐటెమ్ సాంగ్
- కొరియోగ్రఫీ చేసిన పొలాకి విజయ్
- ఇది కలలో కూడా ఊహించని అవకాశం అని వెల్లడి
టాలీవుడ్ యువ కొరియోగ్రాఫర్ పొలాకి విజయ్ తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ కలిసి నటిస్తున్న ఓ ప్రత్యేక పాటకు తాను కొరియోగ్రఫీ చేసినట్టు తెలిపారు. ఇది తన కలలో కూడా ఊహించని, జీవితంలో లభించిన అరుదైన గౌరవమని పేర్కొన్నారు. ఇద్దరు అగ్రహీరోలకు ఒకేసారి కొరియోగ్రఫీ చేయడం జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం అని సంతోషం వ్యక్తం చేశారు.
తన పోస్ట్‌లో విజయ్ భావోద్వేగానికి గురయ్యారు. "అందరికీ ఇష్టమైన నటులు చిరంజీవి గారు, వెంకటేశ్ గారు తమ అద్భుతమైన గ్రేస్, చరిష్మాతో సెట్స్‌లో అదరగొడుతున్నారు. ఈ అవకాశం లభించడం పట్ల మాటల్లో చెప్పలేనంత సంతోషంగా, కృతజ్ఞతగా ఉన్నాను" అని రాశారు. చిరంజీవి, వెంకటేష్‌లను ఆయన 'మెగా విక్టరీ మాస్ డ్యూయో'గా అభివర్ణించారు.
ఈ గొప్ప అవకాశం కల్పించిన దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సుస్మిత, సాహు గార్లకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి తనకు ఎప్పటికీ స్ఫూర్తి అని, ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నానని విజయ్ పేర్కొన్నారు. గతంలో తాను కొరియోగ్రఫీ చేసిన 'మీసాలపిల్ల' పాటను పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపి, ఈ మాస్ డ్యూయో సాంగ్ కూడా అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు.