Gaddam Vivek: గజ్వేల్ నియోజకవర్గం సహా సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించింది: వివేక్

Gaddam Vivek says Congress won big in Sarpanch elections including Gajwel
  • కాంగ్రెస్ గెలుపుతో కేసీఆర్‌కు గుబులు పట్టుకుందన్న మంత్రి
  • గజ్వేల్ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించిందని వెల్లడి
  • బీఆర్ఎస్‌కు పట్టున్న జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలిచిందన్న వివేక్
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌లో ఆందోళన మొదలైందని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ పేర్కొన్నారు. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలో సైతం కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించిందని ఆయన తెలిపారు.

రెండేళ్లకు పైగా ఫామ్ హౌస్‌కే పరిమితమైన కేసీఆర్, ఇప్పుడొచ్చి తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని మంత్రి వివేక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, సర్పంచ్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చాయని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి పట్టున్న జూబ్లీహిల్స్‌లో కూడా కాంగ్రెస్ విజయం సాధించిందని ఆయన గుర్తు చేశారు.
Gaddam Vivek
Telangana
Gajwel
Sarpanch Elections
Congress Party
KCR
BRS Party

More Telugu News