Bandi Sanjay: అభివృద్ధి వదిలేసి బూతులు తిట్టుకుంటున్నారు: బండి సంజయ్

Bandi Sanjay Criticizes Telangana Politics for Neglecting Development
  • తెలంగాణలో అభివృద్ధిపై చర్చ జరగడం లేదన్న బండి సంజయ్
  • అధికార, ప్రతిపక్షాలు బూతుల పురాణం అందుకున్నాయని విమర్శ
  • ప్రజలు పాలన కోరుకుంటే గలీజ్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణ
  • ఉద్యోగాలు, పెట్టుబడులే రాష్ట్రావసరమన్న కేంద్ర సహాయ మంత్రి
తెలంగాణలో అభివృద్ధి పూర్తిగా పక్కదారి పట్టిందని, అధికార, ప్రతిపక్ష పార్టీలు కేవలం బూతులు తిట్టుకోవడానికే పరిమితమయ్యాయని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి, జవాబుదారీతనం అనేవే లేకుండా పోయాయని, కేవలం వ్యక్తిగత దూషణలు తప్ప మరేమీ లేవని ఆయన ఆరోపించారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. "ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ప్రజా సమస్యలను గాలికొదిలేసి, అసభ్య పదజాలంతో పరస్పరం దూషించుకుంటున్నారు. పాలనలో చూపించడానికి ఏమీ లేనప్పుడే నాయకులు ఇలాంటి వ్యక్తిగత విమర్శలకు దిగుతారు. భాష గురించి నీతులు చెప్పే పార్టీలే ఇప్పుడు రాజ్యాంగ వేదికల నుంచి బూతులు మాట్లాడుతున్నాయి" అని అన్నారు.

ప్రజలు సుపరిపాలన కోసం ఓటు వేస్తే, 2014 నుంచి రాష్ట్రంలో గలీజ్ రాజకీయాలు తప్ప మరేమీ చూడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు కావాల్సింది ఉద్యోగాలు, పెట్టుబడులు, రైతులకు మద్దతు, మెరుగైన పట్టణ మౌలిక సదుపాయాలని, కానీ రోజూ అధికార, ప్రతిపక్షాల మధ్య తిట్ల పోటీలు కాదని బండి సంజయ్ హితవు పలికారు.
Bandi Sanjay
Telangana politics
Revanth Reddy
KCR
Political criticism
Telangana development
Abusive language
Governance
BJP Telangana
Telangana government

More Telugu News