Ambati Rambabu: పవన్ కల్యాణ్ పై అంబటి రాంబాబు సెటైర్
- చట్ట విరుద్ధమైన కార్యకలాపాల నేపథ్యంలో భీమవరం డీఎస్పీ బదిలీ
- పవన్ ఆదేశాలతో విచారణ జరిపించిన జిల్లా ఎస్పీ
- డీఎస్పీని బదిలీ చేయించుకున్న పవన్ కు శుభాకాంక్షలు అంటూ అంబటి ట్వీట్
ఏ చిన్న అవకాశం దొరికినా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పించేందుకు వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు రెడీగా ఉంటారనే విషయం తెలిసిందే. తాజాగా ఆయన మరోసారి పవన్ పై సెటైర్లు వేశారు.
వివరాల్లోకి వెళితే, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్సీ జయసూర్యపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. సెటిల్ మెంట్లలో తలదూరుస్తున్నారంటూ బాధితులు నేరుగా పవన్ కు ఫిర్యాదు చేశారు. అంతేకాదు అక్రమ జూదం వంటి కార్యకలాపాల్లో కూడా తల దూరుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించిన డిప్యూటీ సీఎం... లోతుగా విచారించాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. ఈ క్రమంలో ఆయన చట్ట విరుద్ధ కార్యకలాపాల్లో జోక్యం చేసుకుంటున్నారనే విషయం నిర్ధారణ కావడంతో ఆయనపై బదిలీ వేటు వేశారు. ఆయన స్థానంలో కొత్త డీఎస్పీగా రఘువీర్ విష్ణును నియమించారు.
ఈ క్రమంలో పవన్ పై అంబటి రాంబాబు వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. "ఎట్టకేలకు డీఎస్పీ జయసూర్యను బదిలీ చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు శుభాకాంక్షలు" అని ట్వీట్ చేశారు.