Vinayakan: యాక్షన్ సీన్ చిత్రీకరిస్తుండ‌గా ప్ర‌మాదం.. ఆసుపత్రి పాలైన 'జైలర్' విలన్

Jailer Villain Vinayakan Suffers Injury During Action Scene Shoot
  • 'జైలర్' విలన్ వినాయకన్‌కు షూటింగ్‌లో ప్రమాదం
  • 'ఆడు 3' సినిమా యాక్షన్  సీన్ చేస్తుండ‌గా తీవ్ర గాయాలు
  • ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన
  • తాత్కాలికంగా నిలిచిపోయిన సినిమా చిత్రీకరణ
రజనీకాంత్ హీరోగా నటించిన 'జైలర్' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటుడు వినాయకన్ షూటింగ్‌లో ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో ఆయన అభిమానులు, సినీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

వివరాల్లోకి వెళితే... వినాయకన్ ప్రస్తుతం ‘ఆడు 3’ అనే మలయాళ చిత్రంలో నటిస్తున్నారు. తొడుపుజ ప్రాంతంలో జరుగుతున్న షూటింగ్‌లో భాగంగా ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ఆయన ప్రమాదవశాత్తూ గాయపడ్డారు. ఈ ఘటనలో ఆయన భుజం, మెడ భాగంలోని నరాలు, కండరాలకు తీవ్ర గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. వెంటనే యూనిట్ సభ్యులు ఆసుపత్రికి తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని, ఆయనకు కనీసం ఆరు వారాల పూర్తి విశ్రాంతి అవసరమని సూచించారు.

వినాయకన్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ‘ఆడు 3’ సినిమా షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఎన్నో సినిమాల్లో విలక్షణ నటనతో ఆకట్టుకున్నప్పటికీ, 'జైలర్'లో విలన్‌ పాత్ర వినాయకన్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే, సినిమాల కన్నా వివాదాలతోనే ఆయన ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు. గతంలో మద్యం మత్తులో పోలీస్ స్టేషన్‌లో, ఎయిర్‌పోర్ట్‌లో, హోటల్‌లో గొడవపడిన ఘటనల్లో ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి.
Vinayakan
Jailer villain
Aadu 3
Malayalam actor
Accident on set
Movie shooting accident
Action scene injury
Malayalam cinema
Vinayakan controversy
Actor injury

More Telugu News