: పులివెందుల చర్చిలో జగన్ కుటుంబం ప్రత్యేక ప్రార్థనలు

  • సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మాజీ సీఎం
  • తల్లి విజయమ్మ, భార్య భారతితో కలిసి హాజరు
  • చర్చి బయట వేచి ఉన్న అభిమానులకు అభివాదం, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన వైసీపీ చీఫ్
క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి పులివెందులలో సందడి చేశారు. గురువారం ఉదయం స్థానిక సీఎస్ఐ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. పులివెందుల పర్యటనలో భాగంగా జగన్ తన తల్లి వైఎస్ విజయమ్మ, భార్య వైఎస్ భారతి రెడ్డితో కలిసి చర్చికి చేరుకున్నారు. వారితో పాటు మరికొందరు కుటుంబ సభ్యులు కూడా ప్రార్థనల్లో పాల్గొన్నారు.

అనంతరం జగన్ చర్చి వెలుపల వేచి ఉన్న అభిమానులు, స్థానికులకు అభివాదం చేస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. జగన్ పర్యటన సందర్భంగా పులివెందులకు వైసీపీ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చర్చి పరిసరాల్లో పటిష్ఠమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

More Telugu News