RRB jobs: పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్.. 22 వేల ఉద్యోగాల భర్తీ

RRB Recruitment 2026 Notification Released for 22000 Vacancies
  • గ్రూప్ డి పోస్టులకు ఆర్ఆర్ బీ నోటిఫికేషన్
  • జనవరి 21 నుంచి దరఖాస్తులు ప్రారంభం
  • సీబీటీ, పీఈటీ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక
నిరుద్యోగులకు రైల్వే నియామక బోర్డు శుభవార్త చెప్పింది. భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏకంగా 22 వేల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే అవకాశం కల్పించింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తుదారుల వయసు కనీసం 18 సంవత్సరాలు నిండి, 36 సంవత్సరాల లోపు ఉండాలి. రిజర్వేషన్ల ప్రకారం ఆయా కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈబీసీ, మహిళా అభ్యర్థులు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. 2026 జనవరి 21 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. పూర్తి సమాచారం కోసం అధికారిక పోర్టల్ ను సందర్శించాలని రైల్వే బోర్డు సూచించింది.

ఎంపిక ప్రక్రియ..
అభ్యర్థులు ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. సీబీటీలో అర్హత సాధించిన వారికి ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఉంటుంది. మెడికల్ టెస్ట్ పూర్తయ్యాక అభ్యర్థుల తుది జాబితా విడుదల చేస్తారు.
RRB jobs
Govt Jobs
Railway jobs
Railway Recruitment Board
10th pass jobs
Central government jobs
Sarkari Naukri
Employment news
RRB Recruitment 2026
Railway exam
Job notification

More Telugu News