AP Coal Mining: ఏపీలో భారీ బొగ్గు నిక్షేపాలు.. 60 ఏళ్లకు సరిపడా విద్యుత్ ఉత్పత్తికి అవకాశం!

Andhra Pradesh Coal Reserves Discovery Potential for 60 Years Power
  • దేశ బొగ్గు ఉత్పత్తి చిత్రపటంలోకి చేరనున్న ఏపీ
  • ఏలూరు జిల్లా రేచర్ల బ్లాక్‌లో త్వరలో బొగ్గు తవ్వకాలు
  • బిడ్లు దాఖలు చేసిన రిలయన్స్, యాక్సిస్ ఎనర్జీ సంస్థలు
  • 60 ఏళ్ల పాటు 8,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం
ఏపీ త్వరలో దేశ బొగ్గు ఉత్పత్తి చిత్రపటంలో స్థానం సంపాదించనుంది. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం పరిధిలోని రేచర్ల బ్లాకులో బొగ్గు తవ్వకాలు ప్రారంభించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ బ్లాకులో బొగ్గు వెలికితీత, గ్యాసిఫికేషన్ కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి.

దేశవ్యాప్తంగా మొత్తం 41 బొగ్గు బ్లాకుల్లో ఉత్పత్తి లేదా గ్యాసిఫికేషన్ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబరులో బిడ్లను ఆహ్వానించింది. ఇందులో భాగంగా ఈ రెండు కంపెనీలు సంయుక్తంగా 17 బ్లాకుల కోసం బిడ్లు సమర్పించాయి. అందులో ఏపీలోని రేచర్ల బ్లాక్ కూడా ఒకటి కావడం గమనార్హం.

రేచర్ల బ్లాక్ ప్రాధాన్యత
ఏలూరు జిల్లాలోని ఈ రేచర్ల బ్లాకులో అత్యంత నాణ్యమైన గ్రేడ్-1 బొగ్గు నిక్షేపాలు భారీ స్థాయిలో ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఇక్కడ సుమారు 200 నుంచి 300 కోట్ల టన్నుల బొగ్గు అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. ఈ నిక్షేపాల ద్వారా ఏటా 8,000 మెగావాట్ల విద్యుత్‌ను దాదాపు 60 సంవత్సరాల పాటు నిరంతరాయంగా ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ తవ్వకాలు ప్రారంభమైతే రాష్ట్ర ఇంధన అవసరాలకు ఇది కీలకంగా మారనుంది.
AP Coal Mining
Andhra Pradesh Coal
Recharla Block
Eluru Coal
Reliance Industries
Axis Energy Ventures India
Coal Mining Andhra Pradesh
Coal Gasification
Power Generation
Coal Reserves

More Telugu News