Pocharam Srinivas Reddy: కేటీఆర్ వ్యాఖ్యలను ఆయన విజ్ఞ‌త‌కే వదిలేస్తున్నా: పోచారం

Pocharam Slams KTRs Inappropriate Comments
  • కేటీఆర్ తనను దుర్భాషలాడారన్న పోచారం
  • రేవంత్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని కితాబు
  • సర్పంచ్ విలువను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వ్యాఖ్య
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనను దుర్భాషలాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేశారని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. ఆయన తండ్రి కేసీఆర్ కంటే తాను ఐదేళ్లు పెద్ద అని... ఆయన వ్యాఖ్యలను ఆయన విజ్ఞ‌త‌కే వదిలేస్తున్నానని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని కితాబునిచ్చారు. బాన్సువాడలో 111 మంది సర్పంచ్ లు, ఉప సర్పంచ్ అభ్యర్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

సర్పంచ్ పదవి రాజ్యాంగ బద్దమైనదని... దాని విలువను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పోచారం అన్నారు. గ్రామాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా నిధులను సమకూరుస్తుందని... ఆ నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Pocharam Srinivas Reddy
KTR
BRS
Revanth Reddy
Banswada
Telangana Politics
Sarpanch
Village Development
Telangana Government

More Telugu News