లండన్‌లో పర్యావరణవేత్త గ్రెటా థన్‌బర్గ్ అరెస్టు
- పాలస్తీనా అనుకూలవాదులకు మద్దతుగా చేపట్టిన దీక్షలో పాల్గొన్న గ్రెటా
- 'పాలస్తీనా యాక్షన్' అనే సంస్థ ప్లకార్డును పట్టుకుని నిరసన
- 'పాలస్తీనా యాక్షన్'ను గతంలో ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన బ్రిటన్
పాలస్తీనా అనుకూల నిరసనల్లో పాల్గొన్న ప్రముఖ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌ను లండన్ పోలీసులు అరెస్టు చేశారు. 'పాలస్తీనా యాక్షన్' సంస్థ ప్లకార్డును పట్టుకుని ఆమె నిరసన వ్యక్తం చేశారు. ఈ సంస్థను బ్రిటన్ ప్రభుత్వం ఏడాది క్రితమే ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఈ సంస్థపై నిషేధం ఉన్నందున గ్రేటా అరెస్టయ్యారు.
లండన్‌లో గతంలో వివిధ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారన్న ఆరోపణలపై పలువురు పాలస్తీనా మద్దతుదారులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ చర్యలను వ్యతిరేకిస్తూ పాలస్తీనా యాక్షన్ సంస్థ సభ్యులు లండన్ ప్రధాన వీధుల్లో నిరవధిక నిరసన చేపట్టారు. ఇజ్రాయెల్ రక్షణ శాఖతో సంబంధమున్న ఓ బీమా సంస్థ సమీపంలో నిరసన తెలుపుతూ, కార్యాలయం ముందు పెయింట్ వేశారు.
దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఇప్పుడు వారికి మద్దతుగా నిరసన చేపట్టిన గ్రెటాను కూడా అదుపులోకి తీసుకున్నారు. స్వీడన్‌కు చెందిన గ్రెటా థన్‌బర్గ్, భారతదేశంలో ప్రధానంగా 2021లో భారత రైతుల నిరసనలకు మద్దతు తెలుపుతూ ట్వీట్ చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు.